Kurnool Collector Office Recruitment 2023: 8, 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు, జూన్ 30 లాస్ట్ డేట్, జీతం ఎంతంటే?

Rudra Veni

Published On:

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మంచి ఛాన్స్ వచ్చింది.  కర్నూలు కలెక్టర్ ఆఫీసులో పలు ఉద్యోగాల భర్తీకి  (Kurnool Collector Office Recruitment 2023) నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 8వ తరగతి, డిగ్రీ, పీజీ విద్యార్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. 
Kurnool Collector Office Recruitment 2023: 8, 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు, జూన్ 30 లాస్ట్ డేట్, జీతం ఎంతంటే?Kurnool Collector Office Recruitment 2023: 8, 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు, జూన్ 30 లాస్ట్ డేట్, జీతం ఎంతంటే?

కర్నూలు కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 (Kurnool Collector Office Recruitment 2023): కర్నూలు కలెక్టర్ ఆఫీస్‌లో పలు ఉద్యోగాల భర్తీకి (Kurnool Collector Office Recruitment 2023) దరఖాస్తులు కోరడం జరిగింది. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ అధికారులు 15 పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. అతి తక్కువ విద్యార్హతతో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కలెక్టర్ ఆఫీస్ కెరీర్ అధికారిక వెబ్‌సైట్‌‌లో kurnool.ap.gov.in పొందుపరిచారు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 30, 2023వ తేదీలోపు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

కర్నూలు కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్-ఇక్కడ క్లిక్ చేయండి


కర్నూలు కలెక్టర్ ఆఫీసర్ ఖాళీల వివరాలు (Kurnool Collector Office Vacancy Details)

కర్నూలు కలెక్టర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా రకరకాల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఈ దిగువున అందజేయడం జరిగింది.

క్లినికల్ సైకాలజిస్ట్/ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ 1
సీనియర్ ఫిజియోథెరపిస్ట్/ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 1
సీనియర్ ప్రోస్టెటిస్ట్/ ఆర్థోటిస్ట్ 1
ప్రోస్టెటిస్ట్/ ఆర్థోటిస్ట్ టెక్నీషియన్ 1
సీనియర్ స్పీచ్ థెరపిస్ట్/ఆడియాలజిస్ట్ 1
హియరింగ్ అసిస్టెంట్/ జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ 1
మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్ 1
మల్టీపర్సర్ మొబిలిటీ రిహబిలిటేషన్ వర్కర్ 1
క్లర్క్, స్టోర్ కీపర్ 1
ప్యూన్, మెసెంజర్ 1
వొకేషనల్ కౌన్సెలర్, కంప్యూటర్ అసిస్టెంట్ 1
ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్ట్ 1
ట్రాన్స్-డిసిప్లినరీ స్పెషల్ ఎడ్యుకేటర్ 2
Caregiver 1

కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు (Kurnool Collector Office Recruitment Required Eligibility)

కర్నూలు కలెక్టర్ కార్యాలయం అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పోస్టును బట్టి వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి.
  • పోస్టును బట్టి 8వ తరగతి, పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, B.Com, BMR, B.R.Sc, BRT, BPT, BOT, BPO, M.Phil, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, MRW, M.R.Sc, పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుంచి M.Sc, PGDDT, PGDE డిగ్రీలను పొంది ఉండాలి.

ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇచ్చే జీతం ఎంతంటే? (Kurnool Collector Office Salary Details)

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు మంచి జీతం అందజేయడం జరుగుతుంది. జీత భత్యాల వివరాలను ఈ దిగువన పట్టికలో చూడండి.
పోస్ట్ పేరు జీతం (నెలకు)
క్లినికల్ సైకాలజిస్ట్/ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ రూ. 20,500
సీనియర్ ఫిజియోథెరపిస్ట్/ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ రూ. 20,500
సీనియర్ ప్రొస్థెటిస్ట్/ ఆర్థోటిస్ట్ రూ. 20,500
ప్రోస్టెటిస్ట్/ ఆర్థోటిస్ట్ టెక్నీషియన్ రూ. 14,500
సీనియర్ స్పీచ్ థెరపిస్ట్/ఆడియాలజిస్ట్ రూ. 20,500
హియరింగ్ అసిస్టెంట్/ జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ రూ. 14,500
మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్ రూ. 14,500
మల్టీపర్సర్ మొబిలిటీ రిహబిలిటేషన్ వర్కర్ రూ. 14,500
క్లర్క్ మరియు స్టోర్ కీపర్ రూ. 14,500
ప్యూన్ మరియు మెసెంజర్ రూ. 9,500
వొకేషనల్ కౌన్సెలర్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ రూ. 14,500
ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్ట్ రూ. 14,500
ట్రాన్స్-డిసిప్లినరీ స్పెషల్ ఎడ్యుకేటర్ రూ. 14,500
సంరక్షకుడు రూ. 6,250


ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 30వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఉన్న అడ్రస్‌కు అభ్యర్థులు తమ దరఖాస్తులను, సర్టిఫికెట్లను జత చేసి పోస్టు ద్వారా నిర్ణీత గడువులోపు పంపించాలి. నేరుగా కూడా వెళ్లి అందజేయవచ్చు.

/news/kurnool-collector-office-recruitment-2023-notification-42449/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top