కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి
కేంద్రీయ విద్యాలయాల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈరోజు నుంచి (మార్చి 27, 2023)న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 17, 2023 చివరి తేదీ. అలాగే 2 తరగతి నుంచి 12 తరగతులకు (11వ తరగతి మినహా) KV అడ్మిషన్‌లు ఆఫ్‌లైన్ మోడ్‌లో సాగుతాయి. ఒకటో తరగతికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్రీ విద్యాలయాల్లో ఒకటో తరగతి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం అవసరమైన పత్రాలు, ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఈ దిగువున టేబుల్లో అందజేసిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.
| కేంద్రీయ విద్యాలయ ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం డైరక్ట్ లింక్ |
|---|
కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 2023-24 ముఖ్యమైన తేదీలు
కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఈ దిగువున అందించడం జరిగింది.| ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
|---|---|
| KVS క్లాస్ 1 అడ్మిషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | మార్చి 27, 2023 |
| KVS క్లాస్ 1 అడ్మిషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ | ఏప్రిల్ 17, 2023 |
| KVS క్లాస్ 1 అడ్మిషన్ మొదటి లాటరీ ఫలితాల ఎంపిక జాబితా | ఏప్రిల్ 20, 2023 |
| రెండో ఎంపిక జాబితా KVS క్లాస్ 1 అడ్మిషన్ | ఏప్రిల్ 28, 2023 |
| మూడవ ఎంపిక జాబితా KVS క్లాస్ 1 అడ్మిషన్ | మే 5, 2023 |
| KVS 2 నుంచి 10 తరగతుల అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | ఏప్రిల్ 3, 2023 |
కేంద్రీయ విద్యాలయ ప్రవేశానికి అర్హత ప్రమాణాలు 2023-24
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందడానికి విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలను ఈ దిగువున అందిచండం జరిగింది.- భారతీయ జాతీ పిల్లలై ఉండాలి
- క్లాస్ I కోసం అడ్మిషన్ కోరే విద్యా సంవత్సరంలో మార్చి 31 నాటికి పిల్లలకి తప్పనిసరిగా 6 సంవత్సరాలు ఉండాలి.
- వికలాంగ పిల్లల విషయంలో ప్రిన్సిపాల్ గరిష్ట వయోపరిమితిని రెండేళ్ల సడలింపు చేసే అవకాశం ఉంటుంది.
కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 2023-24 కోసం అవసరమైన పత్రాలు
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ కోసం ఈ దిగువున తెలిపిన డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాలి.- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
- పిల్లల పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- SC/ST/OBC సర్టిఫికెట్
- EWS/BPL సర్టిఫికెట్
- సింగిల్ చైల్డ్ కోటాలో అఫిడవిట్ ఉండాలి
- ఉద్యోగి యొక్క సర్వీస్ సర్టిఫికెట్
కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ కోసం అప్లై చేసుకునే విధానం
కేవీ విద్యాలయంలో ఫస్ట్ క్లాస్‌లో ప్రవేశాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లోకి అప్లై చేసుకోవాలి.- అభ్యర్థులు ముందు కేవీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://kvsonlineadmission.kvs.gov.in/index.html సందర్శించాలి.
- హోంపేజీలో మొదటలోనే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్‌కు సంబంధించిన లింక్ ఉండి కింద Clic Here to register అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో ఇచ్చిన అన్ని సూచనలను జాగ్రత్తగా చదవాలి
- కిందకు స్కోల్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో పిల్లల పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ వివరాలతో ఫారమ్‌ను నింపండి. భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















