NEET Admit Card 2023 Expected Dateత్వరలో నీట్ హాల్ టికెట్ 2023 విడుదల (Neet Admit card 2023 Expected Date) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG హాల్ టికెట్‌ని (Neet Admit card 2023 Expected Date) మే 3 లేదా 4, 2023న విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లని పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. యూజర్ ID, పాస్‌వర్డ్ వంటి లాగిన్ ఆధారాలను అందించడం ద్వారా పరీక్ష రాసేవారు NEET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌లో అభ్యర్థికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఆ వివరాలు సరిగ్గా ఉన్నాయో? లేదో? అభ్యర్థులు చెక్ చేసుకోవాలి. NEET UG 2023 పరీక్ష మే 7, 2023న (2 PM నుంచి 5:20 PM వరకు) జరగనుంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ కూడా ఉంది. మరోవైపు నీట్ అడ్మిట్ కార్డుల కోసం చాలామంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నీట్ హాల్ టికెట్ 2023 తేదీ (NEET Admit Card 2023 Date)
పరీక్ష రాసేవారు ఈ దిగువ పేర్కొన్న టేబుల్లో పరీక్ష తేదీతో పాటు NEET హాల్ టికెట్ 2023 విడుదల తేదీని (అంచనా) చెక్ చేయవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
|---|---|
NEET హాల్ టికెట్ 2023 విడుదల తేదీ | మే 3 లేదా 4, 2023 (అంచనా) |
నీట్ పరీక్ష తేదీ 2023 | మే 7, 2023 |
NEET హాల్ టికెట్ 2023లో ఉండే వివరాలు (Details Mentioned on the NEET Admit Card 2023)
NEET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న ఈ కింది వివరాలను కనుగొనగలరు:
- అభ్యర్థి పేరు
- అప్లికేషన్ ID
- పుట్టిన తేదీ
- తండ్రి పేరు
- తల్లి పేరు
- కేటగిరి
- NEET PG తేదీ, సమయం
- అభ్యర్థి సంతకం
- ఛాయాచిత్రం
- NEET UG పరీక్ష స్థలం, చిరునామా
- పరీక్షా కేంద్రం కోడ్
- వైకల్యం స్థితి
- ముఖ్యమైన సూచనలు
అభ్యర్థులు హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పైన పేర్కొన్న వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో? చెక్ చేసుకోవాలి. NEET హాల్ టికెట్ 2023లో ఏదైనా వ్యత్యాసాలను కనుగొంటే, అతను/ఆమె దానిని పరీక్షకు ముందే పరిష్కరించాలి. వెంటనే అధికారులను సంప్రదించి తప్పులను సరిదిద్దుకోవాలి.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















