ఎల్లుండే NEET MDS రౌండ్ 1 సీటు కేటాయింపు జాబితా 2025 విడుదల

manohar

Updated On: July 01, 2025 06:02 PM

MCC జూలై 3, 2025 న అధికారిక వెబ్‌సైట్‌లో NEET MDS రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాన్ని విడుదల చేస్తుంది. అనంతరం, అభ్యర్థులు జూలై 4 నుండి 8, 2025 వరకు తమకు కేటాయించిన కాలేజీలకు వెళ్లి రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి.

 

NEET MDS రౌండ్ 1 సీట్ కేటయింపు ఫలితం 2025 జూలై 3న mcc.nic.inలో విడుదల కానుంది.NEET MDS రౌండ్ 1 సీట్ కేటయింపు ఫలితం 2025 జూలై 3న mcc.nic.inలో విడుదల కానుంది.

NEET MDS రౌండ్ 1 సీట్ల కేటాయింపు ఫలితం 2025(NEET MDS Round 1 Seat Allotment Result 2025): మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ జూలై 3, 2025న NEET MDS రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాన్ని విడుదల(NEET MDS Round 1 Seat Allotment Result 2025)చేయనుంది. అభ్యర్థులు ఎంచుకున్న ఎంపికలు, వారి ర్యాంక్, కాలేజీలలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఈ ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్ అయిన mcc.nic.in లో విడుదల చేస్తారు.NEET MDS రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాన్ని పరిశీలించడానికి, అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.

రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ద్వారా సీటు కేటాయించబడిన అభ్యర్థులు కేటాయింపు పట్ల సంతృప్తిగా ఉంటే, ఆ సీటును అంగీకరిచి జూలై 4 నుండి 8, 2025 మధ్యలో రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి.అయితే, NEET MDS రౌండ్ 1 సీట్ కేటయింపు పట్ల అభ్యర్థులు అసంతృప్తిగా ఉంటే, వారు ఆ సీటును అంగీకరించకుండా ఉండాలి మరియు రౌండ్ 2 NEET MDS సీట్ కేటయింపు 2025 కోసం వేచిచూడాలి.

రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ద్వారా సీటు కేటాయించబడిన అభ్యర్థులకు అధికారులు సీట్ కేటయింపు లెటర్‌ను జారీ చేస్తారు. అభ్యర్థులు ఆ సీట్ కేటయింపు లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, చివరి తేదీకి ముందు సంబంధిత కాలేజీలకు తీసుకెళ్లి రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి.NEET MDS రౌండ్ 1 సీట్ అంగీకార లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కేటాయించిన సీటును అంగీకరించిన తర్వాత, రౌండ్ 1 సీటు ధృవీకరణ కోసం అభ్యర్థులు సీట్ అంగీకార ఫీజును చెల్లించాలి.

రౌండ్ 1 తర్వాత కేటాయించిన సీటును అంగీకరించిన అభ్యర్థులు, చివరి తేదీకి ముందు రిపోర్టింగ్ ప్రక్రియను తప్పకుండా పూర్తిచేయాలి,లేనిపక్షంలో, వారి సీటు కేటాయింపు ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది.రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత, అధికారులు జూలై 9 నుండి 11, 2025 వరకు అభ్యర్థుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం, రిపోర్టింగ్‌కు వెళ్లే అభ్యర్థులు NEET MDS అడ్మిట్ కార్డ్, ర్యాంక్ కార్డ్, సీట్ అలాట్‌మెంట్ లెటర్, 10వ తరగతి మరియు ఇంటర్ మార్క్స్ షీట్లు, ఇంటర్న్‌షిప్ పూర్తి సర్టిఫికెట్, MBBS డిగ్రీ, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్ (ఉండినట్లయితే), ఆధార్ లేదా ఇతర ఐడీ ప్రూఫ్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. సీటు అంగీకరించిన తర్వాత వెనక్కి తగ్గడం సాధ్యపడకపోవచ్చు, కాబట్టి నిర్ణయం ముందు నుంచి స్పష్టంగా ఉండాలి. రిపోర్టింగ్ సమయంలో అంగీకార ఫీజు చెల్లించడం ద్వారా సీటును కన్ఫర్మ్ చేయాలి. రౌండ్ 1 సీటును అంగీకరించని వారు ఆటోమేటిక్‌గా రౌండ్ 2కి అర్హులు అవుతారు. రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసే అవకాశముంటుంది, దానికి సంబంధించిన తేదీలపై అధికారిక సమాచారం కోసం వేచిచూడాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/neet-mds-round-1-seat-allotment-result-2025-to-be-out-on-july-3-at-mcc-nic-in-68195/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top