నీట్ పీజీ మెడికల్ పరీక్ష వాయిదా? (NEET PG 2023 Postponement) ఆరోగ్య శాఖ మంత్రిని కలవనున్న మెడికల్ విద్యార్థులు

Andaluri Veni

Updated On: January 31, 2023 04:13 pm IST

నీట్ పీజీ 2023 పరీక్షను వాయిదా వేయాలని (NEET PG 2023 Postponement) కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండ్వియాను కలవనున్నారు. తెలంగాణలో ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్  పూర్తి కాకపోడంతో NEET 2023 వాయిదా వేయాలని కోరుతున్నారు.  
 
నీట్ పీజీ వాయిదా: (NEET PG 2023 Postponement) ఆరోగ్య శాఖ మంత్రిని కలవనున్న మెడికల్ విద్యార్థులు

నీట్ పీజీ పరీక్ష 2023 వాయిదా (NEET PG 2023 Postponement): ఈ ఏడాది NEET PG 2023 ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పరీక్షను వాయిదా వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చర్చించడానికి ఫెడరేషన్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు జనవరి 31, 2023న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండ్వియాను కలవనున్నారు. ఫెడరేషన్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే మార్చి 5న జరగాల్సిన NEET PG 2023 ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను  వాయిదా వేయాలని కోరుతూ (NEET PG 2023 Postponement)  ఆయనకు లేఖ రాసింది.ఇదే అంశంపై నేడు ఆరోగ్య మంత్రిని కలవనుంది. ఆరోగ్య మంత్రి తమ అభ్యర్థనను అంగీకరిస్తారని, అవసరమైన చర్యలు తీసుకుంటారని  డాక్టర్స్ ఫెడరేషన్ భావిస్తోంది.

నీట్ పీజీ పరీక్ష వాయిదా ఎందుకు? (Why is NEET PG Exam Postponed?)

నీట్ ప్రవేశ పరీక్షను (NEET PG 2023 Postponement)  తెలంగాణలోని ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులు రాయలేని పరిస్థితి నెలకొంది. అధికారిక నోటీసు ప్రకారం బీడీఎస్ విద్యార్థులకు 2023 ఏప్రిల్లో, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆగస్టులో ఇంటర్న్ షిప్ పూర్తి కానుంది. వీరి ఇంటర్న్‌షిప్ పూర్తి కాకముందే అంటే మార్చి 5వ తేదీనే నీట్ పీజీ పరీక్ష నిర్వహించేందుకు ప్రకటన విడుదలైంది. దీంతో వారు ఏడాది కాలాన్ని నష్టపోవాల్సి ఉంటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో దాదాపు 10,000 మంది విద్యార్థులు 2023లో నీట్ పీజీ పరీక్షకు (NEET PG 2023) హాజరు కానున్నారు. వారి ఇంటర్న్ షిప్ ముగియకముందే నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తే వారి భవిష్యత్తు అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. 

దీంతో NEET PG 2023 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ (NEET PG 2023 Postponement) ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్‌తో పాటు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ (UDFA), ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నీట్ PG 2023 వాయిదా కోసం మంత్రికి లేఖలు రాశాయి. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోతారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా మెడకిల్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం మంత్రిని కలవడానికి సిద్ధమయ్యారు. స్వయంగా సమస్య తీవ్రతను, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆయనతో చర్చించనున్నారు. 

గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు విద్యార్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని NBEMS (National Board of Examinations) నీట్ పీజీ (NEET PG 2022) పరీక్షను వాయిదా వేయడం జరిగింది. 2021 NEET PG పరీక్ష కూడా వాయిదా పడింది. అప్పడు ఏప్రిల్ 15న జరగాల్సిన పరీక్ష సెప్టెంబర్ 11, 2021 జరిగింది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షను (NEET PG 2023)ను వాయిదా వేస్తారని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. NEET PG 2023 వాయిదా వేయాలని మెడికల్ సంఘాలతో పాటు లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/neet-pg-2023-postponement-36030/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!