రేపటి వరకు NEET UG 2026 దరఖాస్తు గడువు పొడింపు , మే 3న పరీక్ష

manohar

Updated On: March 10, 2026 10:56 AM

NEET UG 2026 దరఖాస్తు గడువు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 11 రాత్రి 9 గంటల వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా మెడికల్ ప్రవేశ పరీక్ష మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

NEET UG Registration Date ExtendedNEET UG Registration Date Extended

NEET UG 2026 దరఖాస్తు గడువు పొడిగింపు, మే 3న దేశవ్యాప్తంగా పరీక్ష (NEET UG 2026 application deadline extended, nationwide exam on May 3): దేశవ్యాప్తంగా ప్రభుత్వ‑ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో MBBS, BDS, ఆయుష్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రాన్స్ టెస్ట్ (NEET UG) 2026 దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. ముందుగా చివరి తేదీ మార్చి 8గా ప్రకటించగా, కొన్ని కారణాల వల్ల ఇంకా దరఖాస్తు చేయలేకపోయినా అభ్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు గడువును మార్చి 11 రాత్రి 9 గంటల వరకు పొడిగించినట్లు NTA తెలిపింది.

ఈ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు దరఖాస్తు చేయకుండా ఉన్న విద్యార్థులకు ఒక మంచి అవకాశం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ కోర్సుల్లో చేరడానికి ఈ పరీక్షకు సిద్ధంగా ఉండటంతో గడువు పొడిగించడం వారికి ఉపశమనంగా ఉంటుంది. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు చివరి తేదీకి ముందే తమ దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

దరఖాస్తు ఫీజు చెల్లింపుకు గడువు, మార్చి 11 రాత్రి 11:59 వరకు (The deadline for payment of application fee is March 11, 11:59 PM.)

అభ్యర్థులు తమ NEET UG 2026 ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 11 రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. అయితే దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ప్రత్యేకంగా గడువు మార్చి 11 రాత్రి 11:59 వరకు పెంచారు . అందువల్ల అప్లికేషన్ సమర్పించిన తర్వాత కూడా ఫీజు చెల్లింపుకు కొంత అదనపు సమయం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తున్నప్పుడు అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఒకసారి తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సూచించింది. ఏవైనా తప్పులు ఉంటే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అప్లికేషన్‌ను తప్పులులేకుండా పూర్తి చేయాలి అని అధికారులు తెలిపారు.

మే 3న దేశవ్యాప్తంగా NEET UG పరీక్ష నిర్వహణ (NEET UG exam to be conducted across the country on May 3)

NEET UG 2026 పరీక్ష దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించబడుతుంది. ఈ ప్రవేశపరీక్ష ఆఫ్‌లైన్ పెన్-పేపర్ పద్ధతిలో జరుగుతుంది. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షకు హాజరవుతారు.పరీక్షలో అభ్యర్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ మరియు జూలజీ) నుండి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో పొందిన మార్కులు మరియు ర్యాంకుల ఆధారంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్, AYUSH కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. మెడికల్ విద్యలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థుల కోసం NEET UG ప్రధాన ద్వారం.

ఇప్పటి వరకు NEET UG 2026కు దరఖాస్తు చేయని విద్యార్థులు పొడిగించిన గడువును ఉపయోగించి వెంటనే అప్లై చేయాలని NTA సూచించింది. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు రావొచ్చని అధికారులు హెచ్చరించారు, కనుక ముందుగానే అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి NEET ప్రధాన పరీక్షగా ఉండటంతో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/neet-ug-2026-application-last-date-extended-march-11-exam-on-may-3-78049/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top