RBI ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2026: 572 పోస్టులకు ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు అవకాశం

manohar

Published On:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2026 సంవత్సరానికి 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4, 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు గురించి పూర్తి సమాచారం ఈ క్రింద చూడండి.

RBI Office Attendant Recruitment 2026: Apply for 572 Posts Before February 4RBI Office Attendant Recruitment 2026: Apply for 572 Posts Before February 4

RBI ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2026 ప్రారంభం (RBI Office Attendant Recruitment 2026 Starts): భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2026 కోసం ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న RBI కార్యాలయాల్లో మొత్తం 572 ఖాళీలను పూర్తి చేయనున్న ఈ నియామక ప్రక్రియ ద్వారా అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే మంచి అవకాశాలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమై ఉన్నాయి మరియు ఇవి ఫిబ్రవరి 4, 2026 వరకు స్వీకరించబడతాయి. అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో వర్గాన్ని బట్టి ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. జనరల్ మరియు OBC అభ్యర్థుల ఫీజు రూ.450గా నిర్ణయించగా, SC, ST, PwBD మరియు మాజీ సైనికులకి మాత్రమే రూ.50 ఫీజు ఉంది.ఈ రిక్రూట్‌మెంట్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ప్రధానంగా ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల ప్రాథమిక అవగాహన, లాజికల్ థింకింగ్, సంఖ్యా సామర్థ్యం మరియు సాధారణ జ్ఞానం లాంటి అంశాలను పరీక్షిస్తారు. అవసరమైతే భాషా ప్రావీణ్య పరీక్ష కూడా నిర్వహించబడుతుంది. RBIలో ఆఫీస్ అటెండెంట్‌గా ఎంపికైన వారికి ఉద్యోగ భద్రత, స్థిర ఆదాయం మరియు భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు లభిస్తాయి. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ నియామకం ఒక కీలక అవకాశంగా చెప్పవచ్చు.

RBI ఆఫీస్ అటెండెంట్ 2026కి ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for RBI Office Attendant 2026?)

RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది.

  • ముందుగా అబ్యర్ధులు RBI అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ని సందర్శించాలి.
  • ఆ తరువాత హోమ్‌పేజీలో Opportunities@RBI క్లిక్ చేయాలి
  • అక్కడ Current Vacancies ఆప్షన్లను ఎంచుకోవాలి
  • ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి
  • Apply Onlineపై క్లిక్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి
  • పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి
  • రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ తో లాగిన్ కావాలి
  • వ్యక్తిగత సమాచారం మరియు అవసరమైన వివరాలు ఫారంలో నింపాలి
  • ఫోటో, సంతకం మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయాలి
  • వర్తించే దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ లో చెల్లించాలి
  • అన్ని వివరాలు పరిశీలించి ఫారం సబ్మిట్ చేయాలి
  • సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి

మొత్తంగా RBI ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2026 ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి మంచి అవకాశంగా ఉంటంది. ఆసక్తి ఉన్న వారు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 04,2026కు ముందే దరఖాస్తు చేసి,పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/rbi-office-attendant-recruitment-2026-77157/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top