RRB CEN 05/2025లో పోస్టుల సంఖ్యను పెంచుతూ దరఖాస్తు గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించింది. నవంబర్ 25 నుంచి అప్లికేషన్ సవరణకు ఫీజు లేకుండా అవకాశం అందుబాటులో ఉంటుంది
RRB JE Vacancie application Deadline ExtendedRRB CEN No.05/2025 ఖాళీలు పెంపు, గడువు పొడిగింపు (RRB CEN No.05/2025 Vacancies Increase, Deadline Extension): రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) CEN No.05/2025 నోటిఫికేషన్‌కు చెందిన కొన్ని కీలక మార్పులను ప్రకటించింది. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరిటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు కొన్ని రీజియన్లలో పెంచబడ్డాయి. ముఖ్యంగా చెన్నై మరియు జమ్మూ–శ్రీనగర్ రీజియన్లలో అదనపు పోస్టులు చేర్చడంతో అభ్యర్థుల కు అవకాశాలు పెరిగాయి.
అక్టోబర్‌లో విడుదలైన నోటిఫికేషన్‌లో మొత్తం 2,569 ఖాళీలు ప్రకటించబడ్డాయి. తాజా సవరణలో చెన్నై రీజియన్‌లోని పోస్టులు 160 నుంచి 169కు పెరుగాయి. అదే రీతిలో జమ్మూ–శ్రీనాగర్ రీజియన్‌లో ఖాళీలు 88 నుంచి 95కి పెంచారు. ఈ మార్పులు అధికారిక ప్రకటన ప్రకారం వెంటనే అమలులోకి వస్తాయి.
అభ్యర్ధుల సౌకర్యార్థమే దరఖాస్తు గడువును కూడా RRB పొడిగించింది. మొదట నవంబర్ 30తో ముగియాల్సిన దరఖాస్తు ఇప్పుడు డిసెంబర్ 10 వరకు పొడిగించారు. దరఖాస్తు ఫీజు చెల్లించే సమయాన్ని డిసెంబర్ 12కి పెంచగా, అప్లికేషన్ సవరణ కోసం డిసెంబరు 13 నుంచి 22 వరకు సమయం కేటాయించారు.
RRB తాజా ముఖ్య తేదీలు విడుదల, సవరించిన షెడ్యూల్ (RRB releases latest important dates, revised schedule)
RRB సవరించిన కొత్త తేదీలను అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.
వివరాలు | కొత్త తేదీలు |
|---|---|
దరఖాస్తు గడువు ముగింపు తేదీ | డిసెంబర్ 10, 2025 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | డిసెంబర్ 12, 2025 |
అప్లికేషన్ సవరణ ప్రారంభ తేదీ | డిసెంబర్ 13, 2025 |
అప్లికేషన్ సవరణ ముగింపు తేదీ | డిసెంబర్ 22, 2025 |
సవరింపు సదుపాయం అందుబాటులోకి వచ్చే తేదీ | నవంబర్ 25,2025 |
RRB అప్లికేషన్ సవరణ సూచనలు (RRB Application Correction Instructions)
RRB అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో ముఖ్య వివరాలను ఎటువంటి అదనపు ఫీజు లేకుండా నిర్దిష్ట తేదీలలో సవరించుకోవచ్చు.
- ఇప్పటికే ఎంచుకున్న RRBని మార్చుకోవచ్చు
- పోస్ట్ ప్రాధాన్యతలను (Post Preferences) తిరిగి సెట్ చేయవచ్చు
- రైల్వే జోన్/ప్రొడక్షన్ యూనిట్ ప్రాధాన్యతలను మార్చుకొనవచ్చు
- అప్లికేషన్‌లోని కొన్ని వ్యక్తిగత వివరాలను సవరించుకోవచ్చు (అనుమతించిన ఫీల్డ్‌లు మాత్రమే)
- ఫోటో/సిగ్నేచర్ అప్‌లోడ్‌లో తప్పులు ఉంటే అవి సవరించుకోవచ్చు
- సవరించిన వివరాలను ఫైనల్ సబ్మిట్ చేసేముందు తప్పనిసరిగా ప్రివ్యూ ద్వారా పరిక్షించాలి
- సవరణలు చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్/ఈమెయిల్‌కు వచ్చిన OTP అవసరం కావచ్చు
- ఒకసారి ఫైనల్‌గా సబ్మిట్ చేసిన తర్వాత మళ్లీ సవరణ చేయలేరు
- ఈ సవరించుకునే అవకాశం నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉంటుంది మరియు దరఖాస్తు గడువు ముగియేవరకు మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
RRB చేసే ఈ మార్పులు అభ్యర్థులకు మరింత స్పష్టత, సౌకర్యాలు అందిస్తాయి. ఖాళీల పెంపు వాళ్ళ పోటీ అవకాశాలు పెరుగుతుండగా , గడువు పొడిగింపుతో మరింత మంది దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. తాజా తేదీలను పాటించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అభ్యర్థులకు RRB సూచించింది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















