RRB NTPC UG 2026 నియామక ప్రక్రియ ప్రారంభం, 8,850 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

manohar

Updated On: October 28, 2025 06:23 PM

RRB NTPC UG 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 27,2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

RRB NTPC UG 2026 నియామక ప్రక్రియ ప్రారంభం,  8,850 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానంRRB NTPC UG 2026 నియామక ప్రక్రియ ప్రారంభం, 8,850 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

RRB NTPC UG 2026 నియామక ప్రక్రియ ప్రారంభం (RRB NTPC UG 2026 recruitment process begins): రైల్వే నియామక బోర్డులు (RRBs) 2026కి సంబంధించిన NTPC అండర్‌గ్రాడ్యుయేట్ (UG) నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించాయి. మొత్తం 8,850 ఖాళీలు భర్తీ చేయనున్నారు. స్టేషన్ మాస్టర్, కమర్షియల్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ వంటి పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. అభ్యర్థులు అక్టోబర్ 28, 2025 నుంచి నవంబర్ 27, 2025 వరకు సంబంధిత ప్రాంతీయ RRB వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. దరఖాస్తు పంపించే ముందు ఆధార్ వివరాలు, పేరు, జన్మతేది, ఫోటో వంటి వివరాలు సరిచూసుకోవాలి. రైల్వే ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలోనే అత్యంత ఆకర్షణీయమైన అవకాశాలల్లో పాటు ఉండడంతో, ఈ నియామకాలు నిరుద్యోగ యువతకు మంచి అవకాశం ఇవ్వబోతున్నాయి.

RRB NTPC UG 2026 , పోస్టులు, జీతం, వయస్సు పరిమితి వివరాలు (RRB NTPC UG 2026, posts, salary, age limit details)

ఈ కింద పట్టికలో ప్రతి పోస్టుకి సంబంధించిన పే లెవల్ (7వ CPC ప్రకారం), ప్రారంభ జీతం, వయస్సు పరిమితి (01.01.2026 నాటికి) మరియు ఖాళీలు (అన్ని RRBల్లో కలిపి) ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరు

పే లెవల్

ప్రారంభ జీతం(రూ.)

వయస్సు

తాత్కాలిక ఖాళీలు

చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్ వైజర్

6

35,400

18 నుండి 33 సంవత్సరాలు

5800

స్టేషన్ మాస్టర్

6

35,400

18 నుండి 33 సంవత్సరాలు

—-

గూడ్స్ ట్రైన్ మేనేజర్

5

29,200

18 నుండి 33 సంవత్సరాలు

—-

జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్

5

29,200

18 నుండి 33 సంవత్సరాలు

—-

సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్

4

25,500

18 నుండి 33 సంవత్సరాలు

—-

ట్రాఫిక్ అసిస్టెంట్

4

25,500

18 నుండి 33 సంవత్సరాలు

—-

కమర్షియల్ కం టికెట్ క్లర్క్

3

21,700

18 నుండి 33 సంవత్సరాలు

3050

అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్

2

19,900

18 నుండి 33 సంవత్సరాలు

—-

జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్

2

19,900

18 నుండి 33 సంవత్సరాలు

—-

ట్రైన్స్ క్లర్క్

2

19,900

18 నుండి 33 సంవత్సరాలు

—-

RRB NTPC UG 2026కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి (How to apply for RRB NTPC UG 2026)

RRB NTPC UG 2026 అభ్యర్థులు ఆన్‌లైన్లో ఈ క్రింది దశలను పాటిస్తూ దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అభ్యర్థులు మీ సంబంధిత ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
  • ఆ తరువాత హోమ్‌పేజీలో ఉన్న NTPC UG రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి లాగిన్ అవండి.
  • అవసరమైన వివరాలు గల దరఖాస్తు ఫారమ్ పూరించండి.
  • పత్రాలను అప్‌లోడ్ చేసి రుసుము చెల్లించండి.
  • చివరకు ఫారమ్‌ను సమర్పించి ప్రింట్‌ఔట్ తీసుకోండి.

RRB NTPC UG 2026 అభ్యర్థులకు ముఖ్య సూచనలు (Important instructions for RRB NTPC UG 2026 candidates)

RRB NTPC UG 2026 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా పాటించండి.

  • ఆధార్ ద్వారా వ్యక్తిగత వివరాలు తప్పనిసరిగా ధృవీకరించాలి.
  • పేరు మరియు పుట్టిన తేది ఆధార్‌లో SSC సర్టిఫికేట్‌లో ఉన్న వివరాలతో 100% సరిపోవాలి.
  • ఆధార్‌లో తాజా ఫోటో, ఫింగ‌ర్‌ప్రింట్, ఐరిస్ అప్డేట్ చేయించుకోండి.
  • దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించండి.
  • గడువు తర్వాత సమర్పించిన దరఖాస్తులను పరిశీలించబడవు.

RRB NTPC UG 2026 నియామకం రైల్వే రంగంలో ఉద్యోగాల కోసం ఆసక్తి చూపే అభ్యర్థులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. అర్హులైన అభ్యర్థులు గడువు ముగియకముందే దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/rrb-ntpc-ug-recruitment-2026-73218/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy