SBI క్లర్క్ మొదటి వెయింటింగ్ లిస్ట్ 2025 PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

SBI క్లర్క్ మొదటి వెయింటింగ్ లిస్ట్ 2025 PDF విడుదలైంది. అభ్యర్థులు తమ వెయిటింగ్ లిస్ట్‌ (SBI Clerk 1st Waiting List 2025 PDF) కోసం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌  sbi.co.inలో చూడవచ్చు. 

 
SBI క్లర్క్ మొదటి వెయింటింగ్ లిస్ట్ 2025 PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండిSBI క్లర్క్ మొదటి వెయింటింగ్ లిస్ట్ 2025 PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

SBI క్లర్క్ మొదటి వెయిటింగ్ లిస్ట్ 2025 PDF (SBI Clerk 1st Waiting List 2025 PDF) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ఉద్యోగాల భర్తీకి తొలి వెయిటింగ్ జాబితాను (SBI Clerk 1st Waiting List 2025 PDF) విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీలో ఉన్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో తమ ఎంపిక స్థితిని చెక్ చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక తాత్కాలికమేనని గమనించాలి. స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష, ధ్రువీకరణ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే తుది ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారు.

SBI క్లర్క్ మొదటి వెయిటింగ్ లిస్ట్ 2025 PDF (SBI Clerk 1st Waiting List 2025 PDF Download)

ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి SBI క్లర్క్ మొదటి వెయిటింగ్ లిస్ట్ 2025ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SBI క్లర్క్ మొదటి వెయిటింగ్ లిస్ట్ 2025 PDF

SBI క్లర్క్ వెయిటింగ్ లిస్ట్ 2025ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

సెలక్షన్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది దశలను అనుసరించండి.

  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను sbi.co.in సందర్శించాలి.

  • స్టెప్ 2: తర్వాత కెరీర్‌ల విభాగానికి నావిగేట్ అవ్వాలి.

  • స్టెప్ 3: అనంతరం రిక్రూట్‌మెంట్ ఫలితాల ట్యాబ్‌ను ఎంచుకోవాలి.

  • స్టెప్ 4: "తాత్కాలికంగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల వెయిటింగ్ లిస్ట్" లింక్ కోసం చూసి, దానిపై క్లిక్ చేయాలి.

  • స్టెప్ 5: స్క్రీన్‌పై PDF ప్రదర్శించబడుతుంది

  • స్టెప్ 6: భవిష్యత్ సూచన కోసం దీన్ని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేసుకోవాలి.


JAతో పాటు, లేహ్, కార్గిల్ వ్యాలీతో సహా లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం SBI క్లర్క్ వెయిటింగ్ లిస్ట్ 2025 కూడా విడుదలైంది. మొత్తం 13 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. వెయిట్‌లిస్ట్ అభ్యర్థులు రిపోర్టింగ్ చేయని, రాజీనామా చేసిన అభ్యర్థుల కారణంగా తుది జాబితాలోకి ప్రవేశించడానికి అవకాశం లభించింది. అంతకుముందు SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2025 జూన్ 11న 14,191 ఖాళీల కోసం రిలీజ్ అయింది. ప్రిలిమ్స్ క్వాలిఫైయర్లు ఏప్రిల్ 10, 12, 2025లో మెయిన్స్‌కు హాజరు కావడానికి అర్హులవుతారు.

SBI బ్యాంక్ క్లర్క్ 2025 ఎంపిక ప్రక్రియ (SBI Bank Clerk 2025 Selection Process)

SBI బ్యాంక్ క్లర్క్ 2025 కోసం ఎంపిక ప్రక్రియ ఈ కింది దశల్లో పూర్తవుతుంది.

  • ప్రిలిమ్స్ రాత పరీక్ష

  • మెయిన్స్ రాత పరీక్ష

  • స్థానిక భాష పరీక్ష

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • వైద్య పరీక్ష

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/sbi-clerk-1st-waiting-list-2025-pdf-download-69988/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top