SBI SO రిక్రూట్‌మెంట్ 2025 ప్రారంభమైంది, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో అనేక ఖాళీలు ప్రకటించబడ్డాయి. అభ్యర్థులు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి డిసెంబర్ 23లోపు దరఖాస్తు చేసుకోవాలి.
SBI SO Recruitment 2025 BeginsSBI SO 2025 పూర్తి పోస్టు & జీతం వివరాలు (SBI SO 2025 Full Post & Salary Details): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 కోసం స్పెషలిస్టు ఆఫీసర్ (SO) ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానించింది. వెల్ప్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో VP Wealth (SRM), AVP Wealth (RM), కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వంటి ప్రధాన పోస్టులు పెద్దసంఖ్యలో ఖాళీలు విడుదలయ్యాయి. అభ్యర్థులు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 23 వరకు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమయంలో రిజ్యూమ్, ఐడీ ప్రూఫ్, వయస్సు ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, విద్యార్హత మరియు అనుభవ సర్టిఫికెట్లు వంటివి తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అలాగే మూడు పోస్టుల కోసం మూడు వేర్వేరు సర్కిల్స్ ఎంచుకోవాలని ఉంటుంది . ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత సర్కిల్ ప్రిఫరెన్స్ మార్చుకోవడం సాధ్యం కాదు. జీతం, ప్రోత్సాహకాలు మరియు ప్రమోషన్ అవకాశాలతో ఈ నియామకాలు అభ్యర్థులకు మంచి అవకాశం కొనసాగుతున్నాయి.
SBI SO 2025 ఖాళీలు & వయస్సు పరిమితులు పోస్టుల వారీ పూర్తి వివరాలు (SBI SO 2025 Vacancies & Age Limits Post-wise Complete Details)
SBI SO 2025 ఈ టేబుల్ పట్టికలో ప్రతి పోస్టులోని క్యాటగరీవారీ ఖాళీలు, PwBD రిజర్వేషన్ మరియు మే 01,2025 నాటికి వర్తించే వయస్సు పరిమితులు చూపించబడుతున్నాయి.
వరుస క్రమం | పోస్టు పేరు | రకం | ఖాళీలు | PwBD (రిజర్వేషన్) | వయస్సు (మే 01,2025 నాటికి) |
|---|---|---|---|---|---|
1 | VP Wealth (SRM) | రెగ్యులర్ | SC 77 • ST 34 • OBC 119 • EWS 46 • UR 188 • మొత్తం 506 | VI 5 • HI 4 • LD 5 • D&E 5 | కనిష్టం 26 • గరిష్టం 42 |
backlog | —----- | SC 15 • ST 10 • OBC 17 • EWS —• UR — • | VI 2 • HI 2 • LD 1 • D&E 1 | ||
2 | AVP Wealth (RM) | రెగ్యులర్ | SC 33 • ST 15 • OBC 52 • EWS 20 • UR 82 • మొత్తం 206 | VI 2 • HI 2 • LD 3 • D&E 2 | కనిష్టం 23 • గరిష్టం 35 |
backlog | —----- | SC – • ST 04 • OBC–- • EWS —• UR — • | VI 3 • HI 3 • LD 2 • D&E 2 | ||
3 | కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ | రెగ్యులర్ | SC 47 • ST 21 • OBC 73 • EWS 28 • UR 115 • మొత్తం 284 | VI 3 • HI 3 • LD 3 • D&E 3 | కనిష్టం 20 • గరిష్టం 35 |
backlog | —----- | SC –• ST —• OBC – • EWS —• UR — • | VI 3 • HI 2 • LD 2 • D&E 3 |
పోస్టుల వారీ ఖాళీలు, వయస్సు పరిమితులు స్పష్టంగా తెలిసిన తర్వాత, ప్రతి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన జీత నిర్మాణం, వేరియబుల్ పే మరియు కాంట్రాక్టు వివరాలు ఇప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది.ఈ కింది టేబుల్‌లో SBI ఈ నియామకానికి ప్రకటించిన పూర్తిస్థాయి సాలరీ ప్యాకేజి వివరాలు ఇవ్వబడ్డాయి.
SBI SO 2025 జీతం & కాంట్రాక్ట్ వివరాలు , CTC & పేమెంట్ విధానం (SBI SO 2025 Salary & Contract Details, CTC & Payment Method)
ఈ పట్టికలో ప్రతి పోస్టుకు గరిష్ట CTC, పనితీరు ఆధారిత పేమెంట్ మరియు కాంట్రాక్ట్ కాలం వివరాలు ఇవ్వబడ్డాయి.
వరుస క్రమం | పోస్ట్ పేరు | గరిష్ట CTC (రూ. లక్షల్లో) | PLP / వేరియబుల్ పే | కాంట్రాక్ట్ కాలం |
|---|---|---|---|---|
1 | VP Wealth (SRM) | 44.70 లక్షలు | పనితీరు లింక్డ్ పే+ వార్షిక ఇన్క్రిమెంట్ | 5 సంవత్సరాలు (అదనంగా ఎక్కువగా 4 సంవత్సరాల వరకు పొడగింపు అవకాశముందు) |
2 | AVP Wealth (RM) | 30.20 లక్షలు | బ్యాంకు విధానాల ప్రకారం PLP అర్హత | పేర్కొనలేదు |
3 | కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ | 6.20 లక్షలు | పేర్కొనలేదు | పేర్కొనలేదు |
SBI SO రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో భారీ సంఖ్యలో ఖాళీలు వచ్చినాయి, ఇది ఉద్యోగార్థులకు మంచి అవకాశం. పోస్ట్ కోసం కావలసిన అర్హతలు, వయస్సు పరిమితులు, జీతం వివరాలు మరియు సర్కిల్ ప్రిఫరెన్స్‌ల వంటి ముఖ్య సూచనలను చెక్ చేసి, అవసరమైన పత్రాలను సరిగ్గా అప్‌లోడ్ చేస్తూ డిసెంబర్ 23 లోపు దరఖాస్తును పూర్తి చేయడం చాలా కీలకం. సరైన ప్రిపరేషన్‌తో ఈ నియామకంలో మంచి కెరీర్ అవకాశాలు పొందచ్చు
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?


















