School Assembly News Headlines for 12 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండి

Rudra Veni

Published On:

స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాల కోసం ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను  (School Assembly News Headlines for 12 July 2023) ఇక్కడ అందజేయడం జరిగింది.
 
School Assembly News Headlines for 12 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండిSchool Assembly News Headlines for 12 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండి

జూలై 12 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 12 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.

12 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 12 Juay 2023)


ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)

  • ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దామోదరం సంజీవయ్య జెన్‌కో విద్యుత్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు పరుగులు తీశారు.
  • అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై పూర్తిస్థాయి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని ధర్మాసనం వెల్లడించింది.
  • ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు సాగర్ కెనాల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. 12 మంది గాయపడ్డారు.

తెలంగాణ వార్తలు (Telangana News)

  • రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
  • హైదరాబాద్‌లో దోమలగూడలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఏడుగురు గాయపడ్డారు. బోనాల పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
  • తెలంగాణలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 28లోగా సమాధానం చెప్పాలని సూచించింది.

స్కూల్ అసెంబ్లీ కోసం జాతీయ వార్తలు (National News Headlines for School Assembly)

  • జమ్మూ కశ్మీర్ నుంచి వరసగా నాలుగో రోజు అమర్‌నాథ్ యాత్ర నిలిపివేయబడింది.
  • ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం అంటే జూలై 11, 2023 నాడు దక్షిణ కశ్మీర్‌లోని ఐదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది.
  • భారతదేశంలో తాజాగా 20 COVID-19 కేసులు నమోదయ్యాయి.
  • మణిపూర్ సీఎం నియంత్రణ కోల్పోయారని, రాజీనామా చేయాలని వామపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
  • మయన్మార్‌కు ఆయుధాలు ఇవ్వకుండా భారత్‌ను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు మాక్రాన్‌ కోరారు.
  • సెప్టెంబర్ 30 నాటికి మణిపూర్, మిజోరాం ప్రభుత్వాలు "అక్రమ వలసదారుల" బయోమెట్రిక్‌లను నమోదు చేయాలని హోం మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది.
  • ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు రావడంతో శ్రీలంక నుంచి బెంగళూరుకు తరలించారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/school-assembly-news-headlines-july-12-2023-42948/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top