సెబీ 2025లో 110 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం నియామక ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 28, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
SEBI Recruitment 2025: Apply For 110 Officer Posts For Legal, IT, Engineering at sebi.gov.inసెబీ 2025లో 110 అసిస్టెంట్ మేనేజర్ నియామకం (SEBI to recruit 110 Assistant Managers in 2025) :భారత్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) 2025లో మొత్తం 110 ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30, 2025 నుంచి ప్రారంభమై నవంబర్ 28, 2025 వరకు కొనసాగుతుంది. ఈ నియామకాలు జనరల్, లీగల్, ఐటి, రీసెర్చ్, ఆఫీషియల్ లాంగ్వేజ్, ఇంజినీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్) విభాగాల్లో జరుగనున్నాయి. ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.ఫేజ్ 1 పరీక్ష జనవరి 10, 2026, ఫేజ్ 2 పరీక్ష ఫిబ్రవరి 21, 2026, అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతి దశలో అర్హత సాధించిన అభ్యర్థులే తదుపరి దశకు పిలవబడతారు.
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా PG పూర్తి చేసి ఉండాలి. వయస్సు పరిమితి 30 సంవత్సరాలు, రిజర్వేషన్లు ప్రకారం సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు, జనరల్/OBC అభ్యర్థులకు రూ.1000, SC/ST/PwBD అభ్యర్థులకు రూ.100. ఆసక్తి ఉన్నవారు www.sebi.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెబీ రిక్రూట్మెంట్ 2025 ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి (How to Apply for SEBI Recruitment 2025 Online)
సెబీ రిక్రూట్మెంట్ 2025 ఆసక్తి గల అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు ఈ క్రింద ఉన్న దశలను పాటించండి.
- ముందుగా అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్ www.sebi.gov.in సందర్శించండి.
- ఆ తరువాత “Careers” సెక్షన్‌లో SEBI Grade A Recruitment 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
- కొత్త యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేయండి.
- అవసరమైన వ్యక్తిగత, విద్యా వివరాలు నమోదు చేయండి.
- ఫోటో, సంతకం మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- చివరిగా ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
సెబీ రిక్రూట్మెంట్ 2025 ఖాళీల వివరాలు (SEBI Recruitment 2025 Vacancy Details)
సెబీ రిక్రూట్మెంట్ 2025 ఖాళీలను వివిధ విభాగాల్లో మొత్తం 110 ఆఫీసర్ గ్రేడ్ A 9అసిస్టెంట్ మేనేజర్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగం | ఖాళీల సంఖ్య |
|---|---|
జనరల్ (General) | 56 |
లీగల్ (Legal) | 20 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) | 22 |
రీసెర్చ్ (Research) | 4 |
ఆఫీషియల్ లాంగ్వేజ్ (Official Language) | 3 |
ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) | 2 |
ఇంజినీరింగ్ (సివిల్) | 3 |
మొత్తం | 110 |
సెబీ రిక్రూట్మెంట్ 2025 ఆర్థిక రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హత ఉన్నవారు నవంబర్ 28, 2025లోపు ఆన్‌లైన్‌గా దరఖాస్తు చేయాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















