TCILలో 150 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

manohar

Published On:

TCILలో 150 ఖాళీలను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. TCIL పోస్టుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

TCIL JObs 2025TCIL JObs 2025

TCILలో 2025 భారీగా 150 ఖాళీలు (TCIL to have 150 vacancies by 2025): టెలిక‌మ్యూనికేష‌న్స్ కన్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL) ఒప్పంద ప్రాతిప‌దిక‌న మొత్తం 150 మ్యాన్‌పవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టీమ్ లీడ్స్, టెక్నీషియన్, రిగ్గర్, సివిల్ ఇంజినీయర్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ వంటి వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా సంబంధిత డిగ్రీతో పాటుగా సంబంధిత పని అనుభవం అవసరం. అభ్యర్థుల వయోపరిమితి పోస్టును అనుసరించి 35 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుంద‌ని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి, దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ డిసెంబరు 09,2025. ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా చేయనున్నారని తెలిపింది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించి సమయానికి దరఖాస్తు చేయాలి.

TCIL 2025 అధికారిక నోటిఫికేషన్ లింక్ (TCIL 2025 Official Notification Link)

ఈ క్రింద TCIL ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన లింక్ వివరాలు ఇవ్వబడ్డాయి.

TCIL 2025 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (TCIL 2025 Online Application Procedure)

TCIL 2025 ఈ క్రింద సూచించిన విధంగా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

  • ముందుగా TCIL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఆ తరువాత Careers లేదా Recruitment సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
  • సంబంధిత పోస్టు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను సరిగా నింపండి.
  • అవసరమైన సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • చివరగా ఫారమ్‌ను సమర్పించి, కాపీని సేవ్ చేసుకోండి.

TCIL 2025 పోస్టుల వివరాలు పూర్తి ఖాళీల జాబితా (TCIL 2025 Post Details Complete Vacancy List)

ఈ క్రింద TCIL విడుదల చేసిన వివిధ పోస్టుల పేరు మరియు వాటికి ఉన్న ఖాళీల సంఖ్య ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరు

ఖాళీల సంఖ్య

టీమ్ లీడర్

16

మైక్రోవేవ్ / వైర్ లెస్ టెక్నీషియన్

16

రిగ్గర్

32

IBS డివైడ్/ఇంజనీర్

2

IBS టెక్నీషియన్

5

IBS హెల్పర్

15

సివిల్ ఇంజినీర్

2

సివిల్ సూపర్ వైజర్

5

సివిల్ హెల్పర్

20

IP ఇంజినీర్

2

సీనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్

11

జూనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్

9

సివిల్ టీమ్ లీడర్

6

సివిల్ హెల్పర్

8

సీనియర్ ఇంజినీర్

1

మొత్తం ఖాళీలు

150

ఈ TCIL నియామక నోటిఫికేషన్ ద్వారా వివిధ టెక్నికల్ మరియు సివిల్ విభాగాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tcil-150-vacancies-notification-2025-74448/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి