TS మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023(TS Model School Admission 2023): ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలు

Guttikonda Sai

Updated On: January 18, 2023 02:43 pm IST

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ (TS Model School Admission 2023)  అప్లికేషన్ ఫారం అధికారిక వెబ్సైటు telanganams.cgg.gov.in లో అందుబాటులో ఉంది., అప్లికేషన్ ప్రాసెస్ చివరి తేదీ ఫిబ్రవరి 15,2023. విద్యార్థుల అర్హత ప్రమాణాలు, ఏజ్ లిమిట్ మొదలైన సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
TS మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలు

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 ( TS Model School Admission 2023) : తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ అడ్మిషన్ అడిషనల్ డెరైక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 194 మోడల్ స్కూల్ లలో ఉన్న సీట్ల కోసం విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఈ సీట్ల కోసం అప్లికేషన్ ఫారం విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్య సంవత్సరానికి 6వ తరగతి సీట్లను భర్తీ చేయనున్నారు, అంతే కాకుండా 7వ తరగతి నుండి 10వ తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్సైటు telanganams.cgg.gov.in లో ఈ సీట్ల కోసం విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15, ఫిబ్రవరి 2023. 

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 పొందాలి అనుకుంటున్న విద్యార్థులకు కావాల్సిన అర్హత, ఏజ్ లిమిట్, ఫీజు వివరాలు మొదలైన సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 ముఖ్యమైన తేదీలు ( TS Model School Admission 2023 Important Dates)

తెలంగాణ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ కోసం చూస్తున్న విద్యార్థులకు అవసరమైన తేదీల సమాచారం ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు. 

పరీక్ష నిర్వహించే సంస్థ

తెలంగాణ మోడల్ స్కూల్ 

రిజిస్ట్రేషన్ ప్రారంభం

10 జనవరి 2023

రిజిస్ట్రేషన్ చివరి తేదీ

15 ఫిబ్రవరి 2023

పరీక్ష తేదీ 

16 ఏప్రిల్ 2023

ఫలితాలు

24 మే 2023

అప్లికేషన్ విధానం

ఆన్లైన్

అధికారిక వెబ్సైట్

telanganams.cgg.gov.in

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 అర్హత ప్రమాణాలు ( TS Model School Admission 2023 Eligibility) 

తెలంగాణ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ పొందడానికి కావాల్సిన అర్హతలు తరగతుల ప్రకారంగా ఈ క్రింద తెలుసుకోవచ్చు. 

  • 6వ తరగతి అడ్మిషన్ కోసం విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ పాఠశాల నుండి 5వ తరగతి లో ఉత్తీర్ణత సాధించాలి. 
  • 7వ తరగతి అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు 6వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. 
  • 8వ తరగతి లో అడ్మిషన్ కావాలి అనుకుంటున్న విద్యార్థులు 7వ తరగతిలో ఉత్తీర్ణత మార్కులు సాధించాలి. 
  • 9వ తరగతిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థులు 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. 
  • 10వ తరగతిలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు 9వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. 

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 ఏజ్ లిమిట్ ( TS Model School Admission 2023 Age Limit) 

తెలంగాణ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ పొందడానికి ఉండాల్సిన ఏజ్ లిమిట్ తరగతి ప్రకారంగా ఈ క్రింది పట్టిక లో వివరించబడింది. 

తరగతి

ఏజ్ లిమిట్ ( 2023 ఆగస్ట్ 31 తేదీ వరకు)

6వ తరగతి

10 సంవత్సరాలు

7వ తరగతి

11 సంవత్సరాలు

8వ తరగతి

12 సంవత్సరాలు

9వ తరగతి

13 సంవత్సరాలు

10వ తరగతి

14 సంవత్సరాలు


తెలంగాణ మోడల్ స్కూల్ గురించిన మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/te-news-ts-model-school-admission-2023-application-form-instructions-35479/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!