
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ (Telangana DSC Exam Dates 2023 Latest):
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ (Telangana DSC Exam Dates 2023 Latest) వచ్చింది. 5 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే తాజాగా తెలంగాణ డీఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ (TS DSC Exams Schedule) రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 11 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఎగ్జామ్స్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT) పోస్టులకు ఆరోజు రోజులపాటు పరీక్షలు జరగ్గా, ఇక ఉన్నత పాఠశాలల్లో(6-10 తరగతులు) పాఠాలు చెప్పేందుకు అవసరమైన స్కూల్ అసిస్టెంట్ల(SA) పోస్టులకు మూడు రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ఇక.. పీఈటీలు, భాషా పండితులకు ఒక్కో రోజు పరీక్ష ఉంటుంది.
ఈ పరీక్షలు రెండు విడతల చొప్పున జరుగుతాయి. అంటే ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21, 2023 చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల సంఖ్యను బట్టి అధికారులు పరీక్షలను తగ్గించే, పెంచే అవకాశం కూడా ఉంది.
TS DSC ఎగ్జామ్ షెడ్యూల్ (TS DSC Exam schedule 2023)
టీఎస్ డీఎస్సీ 2023 పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్, భౌతిక శాస్రం, జీవశాస్త్రం, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్) | నవంబర్ 20, 21 (4 సెషన్లలో) |
---|---|
స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళం, సంస్కృతం) | నవంబర్ 22 |
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (అన్ని మీడియంలలో పరీక్ష) | నవంబర్ 23 |
లాంగ్వేజ్ పండిట్లు (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళం, సంస్కృతం) | నవంబర్ 24 |
సెకండరీ గ్రేడ్ టీచర్ (అన్నీ భాషల్లో) | నవంబర్ 25 నుంచి 30 వరకు |
తెలంగాణ డీఎస్సీ ఎగ్జామ్ విధానం (TS DSC Exam Pattern)
తెలంగాణ డీఎస్సీ 2023కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కచ్చితంగా ఎగ్జామ్స్ విధానం గురించి తెలుసుకుని ఉండాలి. అభ్యర్థులు కోసం ఇక్కడ పరీక్షా విధానాన్ని అందజేస్తున్నాం. ప్రశ్నాపత్రంలో 160 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 80 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. అంటే స్కూల్ అసిస్టెంట్, SGT, భాషా పండిట్‌లకు నిర్వహించే పరీక్షల్లో 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అర మార్కు చొప్పున 80 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఈ పరీక్ష రాసేవారికి టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే మొత్తం 100 మార్కులకు పరిగణనలోకి తీసుకుని ఫైనల్ ర్యాంకు కేటాయించడం జరుగుతుంది.అలాగే పీఈటీ, పీఈడీలకు వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను తెలుసుకోండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



