తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్లు - 10 రోజుల్లో ముగియనున్నదరఖాస్తు గడువు

Rudra Veni

Updated On: February 18, 2026 12:01 PM

తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే దరఖాస్తు గడువు ముగియనుంది. 

తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్లు - 10 రోజుల్లో ముగియనున్నదరఖాస్తు గడువుతెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్లు - 10 రోజుల్లో ముగియనున్నదరఖాస్తు గడువు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఇప్పటికీ అప్లై చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలని. ఈ ప్రవేశ పరీక్షలో క్వాలి 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు 7 నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా పరీక్ష ఉంటుంది. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది.

TG Model స్కూల్ అడ్మిషన్ల కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..

TG మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం ఈ దిగువున తెలిపిన స్టెప్స్ ఫాలో అయి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థుల వివరాలలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఒక్కసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత మళ్లీ ఆ వివరాలు మార్చే వీలుండదు.
  • అభ్యర్థులు ముందుగా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌‌కి వెళ్లాలి.

  • హోంపేజీలో 6వ తరగతి, 7 నుంచి 10వ తరగతి నోటిఫికేషన్లకు సంబంధించిన లింక్‌లు ఉంటాయి.

  • అందులో మీకు కావాల్సిన లింక్‌పై క్లిక్ చేస్తే దరఖాస్తు ఫార్మ్ కనబడుతుంది. అందులో విద్యార్థుల వివరాలను ఫిల్ చేయాలి. అలాగే విద్యార్థి ఫోటోను కూడా అప్‌లోడ్ చేయాలి.

  • చివరిలో ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేటగిరీలను బట్టి ఫీజు ఉంటుంది. BC, SC, ST, PHC విద్యార్థులు రూ.125, OC విద్యార్థఉలు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  • విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఆధారంగా విద్యార్థులకు హాల్ టికెట్లు డౌన్‌‌లోడ్ చేసుకోవాలి.

TG Model స్కూల్ అడ్మిషన్లు 2026 - పరీక్ష విధానం


TG మోడల్ స్కూళ్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష విధానం గురించి విద్యార్థులు తెలుసుకోవాలి. 6వ తరగతి ప్రవేశాలకు 100 మార్కులు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో తెలుగు, లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 5వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఈ పరీక్షను తేలికగా రాయవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/telangana-model-school-application-2026-last-date-77696/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top