TG ICET 2026 దరఖాస్తు గడువు పొడిగింపు, మార్చి 23 వరకు దరఖాస్తులకు అవకాశం, మే 13-14న పరీక్షలు

manohar

Published On:

TG ICET 2026 దరఖాస్తు గడువు మార్చి 23 వరకు పొడిగించారు. పరీక్షలు మే 13, 14న నిర్వహిస్తారు, ఇది MBA, MCA ప్రవేశాలకు కీలకం.TG ICET 2026 దరఖాస్తు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

TG ICET 2026 Application Deadline ExtensionTG ICET 2026 Application Deadline Extension

TG ICET 2026 దరఖాస్తు గడువు పొడిగింపు వివరాలు (TG ICET 2026 Application Deadline Extension Details): తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను చదవాలని భావించే విద్యార్థులకు TG ICET 2026 మంచి అవకాశంగా మారింది. MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి ఈ రాష్ట్రస్థాయి పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించబడటంతో ఇంకా అప్లై చేయలేకపోయిన వారికి మార్చి 23 వరకు మరో అవకాశం కలిగింది. మే 13, 14 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఇప్పటి నుంచే సీరియస్‌గా ప్రిపరేషన్ మొదలుపెట్టడం మంచిది. సమయాన్ని బాగా ప్లాన్ చేసి, సిలబస్ మీద క్లారిటీతో ముందుకు వెళ్తే మంచి ర్యాంక్ సాధించే అవకాశాలు పెరుగుతాయి.

TG ICET పరీక్ష ద్వారా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీలు MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి లేదా ఫైనల్ ఇయర్‌లో ఉండాలి, సాధారణంగా 50% మార్కులు (రిజర్వ్డ్‌ క్యాటగిరీలు కోసం 45%) అవసరం. పరీక్షను మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి, ప్రాక్టీస్‌తో పాటు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించడం ముఖ్యము.

TG ICET 2026 ముఖ్యమైన తేదీలు (TG ICET 2026 Important Dates)

TG ICET 2026 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ క్రింది పట్టికలో చూడండి

వివరాలు

తేదీలు

TG ICET 2026 దరఖాస్తు చివరి గడువు తేదీ (పొడిగింపు తర్వాత )

మార్చి 23,2026

TG ICET 2026 అడ్మిట్ కార్డ్ విడుదల

మే 2026 మొదటి వారం

TG ICET 2026 పరీక్ష తేదీలు

మే 13 & 14,2026

ప్రాథమిక కీ విడుదల

మే 2026

TG ICET 2026 ఫలితాలు విడుదల

జూన్ 2026

TG ICET 2026కి ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for TG ICET 2026?)

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.in ఓపెన్ చేయండి

  • ఆ తరువాత “TG ICET 2026 Application Form” లింక్‌పై క్లిక్ చేయండి
  • ముందుగా ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి
  • అవసరమైన వ్యక్తిగత, విద్యా వివరాలు నమోదు చేయండి
  • ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి
  • అన్ని వివరాలు పరిశీలించి సబ్మిట్ చేయండి
  • అప్లికేషన్ ఫాం ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోండి

TG ICET 2026 దరఖాస్తు గడువు పొడిగించబడటం అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే అప్లై చేసి, సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ చేయడం ద్వారా మంచి ర్యాంక్ పొందవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tg-icet-2026-application-last-date-extended-march-23-exam-dates-may-13-14-78262/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top