TG LAWCET 2025 కౌన్సిలింగ్ ఆగస్ట్ 4 నుంచి ప్రారంభం

manohar

Published On:

TG LAWCET కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగస్ట్ 4న ప్రారంభం అవుతుంది.అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి  సమాచారం ఇక్కడ అందించాము.
TG LAWCET 2025 కౌన్సిలింగ్ ఆగస్ట్ 4 నుంచి ప్రారంభంTG LAWCET 2025 కౌన్సిలింగ్ ఆగస్ట్ 4 నుంచి ప్రారంభం

TG LAWCET కౌన్సిలింగ్ 2025 షెడ్యూల్ విడుదల, అవసరమైన పత్రాలు, తేదీలు, ఫీజు వివరాలు ఇవే (TG LAWCET Counselling 2025 schedule released, required documents, dates, fee details are as follows): TG LAWCET 2025 కౌన్సిలింగ్ ప్రక్రియను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఆగస్ట్ 4, 2025 నుంచి ప్రారంభించబోతోంది. ఈ కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలోని వివిధ లా కాలేజీల్లో 3 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల LLB కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. దాని తర్వాత ఆప్షన్ ఎంట్రీ ప్రక్రియ జరుగుతుంది, ఇందులో అభ్యర్థులు తాము ఇష్టపడే కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసిన ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయించి, అలాట్‌మెంట్ ఫలితాలను ప్రకటిస్తారు. అలాట్‌మెంట్ వచ్చిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలలో రిపోర్ట్ చేసి అడ్మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ lawcet.tsche.ac.in లో అందుబాటులో ఉంటాయి.

TG LAWCET 2025 కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు(TG LAWCET 2025 Counselling Important Dates)

TG LAWCET 2025 కౌన్సిలింగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను తెలంగాణా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసి, అవసరమైన దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

వివరాలు

తేదీలు

కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ

ఆగస్ట్ 4, 2025

రిజిస్ట్రేషన్ చివరి తేదీ

ఆగస్ట్ 12, 2025

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు

ఆగస్ట్ 6 నుండి 11 వరకు

ఆప్షన్ ఎంట్రీ తేదీలు

ఆగస్ట్ 7 నుండి 13 వరకు

సీటు అలాట్‌మెంట్ ఫలితాలు తేదీ

ఆగస్ట్ 16, 2025

కాలేజీ రిపోర్టింగ్ తేదీ

ఆగస్ట్ 17 నుండి ప్రారంభం

TG LAWCET 2025 కౌన్సిలింగ్ అవసరమైన పత్రాలు(TG LAWCET 2025 Counselling Required Documents)

  • TG LAWCET 2025 హాల్ టికెట్
  • ర్యాంక్ కార్డ్
  • SSC, ఇంటర్మీడియట్ / డిగ్రీ మార్కులు మెమోలు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
  • స్టడీ సర్టిఫికేట్‌లు
  • ఆదార్ కార్డ్
  • కుల సర్టిఫికేట్ (BC/SC/ST/EWS)
  • రెసిడెన్షియల్ సర్టిఫికేట్ / డోసైల్ సర్టిఫికేట్
  • ఆదాయ సర్టిఫికేట్ (అవసరమైతే)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  • ఇతర సంబంధిత పత్రాలు

TG LAWCET 2025 కౌన్సిలింగ్ ఫీజు వివరాలు (TG LAWCET 2025 Counselling Fee Details)

  • OC / BC అభ్యర్థులకు, రూ.800
  • SC / ST అభ్యర్థులకు, రూ.500
  • ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి
  • ఫీజు చెల్లింపు తర్వాతే ఆప్షన్ ఎంట్రీకి అర్హత ఉంటుంది

TG LAWCET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్ట్ 4 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానుంది. LLB కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేసి, అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని ప్రతి దశలో జాగ్రత్తగా పాల్గొనాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tg-lawcet-2025-counselling-starts-on-august-04-69313/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top