TG TET 2026 పరీక్ష జూన్ లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేయబడింది. గత పరీక్ష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని , అభ్యర్థులు ముందుగా ప్రిపరేషన్ ప్రారంభించాలి.TG TET 2026 పరీక్ష గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
TG TET expected date 2026
తెలంగాణలో టీచర్ కావాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడు ఎదురుచూస్తున్న ప్రధాన పరీక్ష TG TET 2026. ఫిబ్రవరి 10వ తేదీన నవంబర్‌లో విడుదలైన TG TET 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కొంతమంది క్వాలిఫై అయ్యారు. కొంతమంది తాము అనుకున్నస్థాయిలో మార్కులు పొందలేకపోయారు. ఈ క్రమంలో ఈ ఏడాది వచ్చే మరో TG TET 2026 నోటిఫికేషన్ కోసం అందరి ఆలోచనలు మొదలయ్యాయి. ఏడాదికి రెండుసార్లు TET నిర్వహించాలనే నిబంధన ప్రకారం ఈ ఏడాది ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మేరకు మరో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, ఎప్పుడు పరీక్ష ఉంటుందని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది ట్రెండ్‌ను పరిశీలిస్తే.. మరో TET నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోవిడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పరీక్ష జూన్ లేదా జూలైలో జరిగే ఛాన్స్ఉంది.
ఎందుకంటే గత ఏడాది 2024 నవంబర్‌లో TG TET నోటిఫికేషన్ పడితే పరీక్ష జనవరి 2025లో జరిగింది. ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. మరో నోటిఫికేషన్ ఏప్రిల్లో విడుదలైతే పరీక్ష జూన్‌లో జరిగింది.
ఈ ఏడాది కూాడా ఇదే ట్రెండ్ కొనసాగితే ఏప్రిల్ నెలలో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. TG TET 2026 జూన్ లేదా జూలైలో జరగనుంది. గత సంవత్సరం ట్రెండ్ ప్రకారం ఇది కేవలం అంచనాగా చెబుతున్నది మాత్రమే. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి.
అందుకే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం వేచి ఉండకుండానే ఇప్పటినుంచి సిలబస్ పూర్తి చేయడం, గత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్టులు సాధన మొదలుపెట్టితే మంచిది. ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటే పరీక్ష సమయానికి ఒత్తిడి తగ్గి మంచి ఫలితం పొందే అవకాశాలు పెరుగుతాయి.
గత TG TET 2025 విశ్లేషణ: ప్రశ్నల స్థాయి, అభ్యర్థుల అభిప్రాయాలు (Past TG TET 2025 Analysis: Level of Questions and Candidates' Opinions)
TG TET 2025 పరీక్షపై అభ్యర్థుల అభిప్రాయాలను పరిశీలిస్తే, మొత్తం ప్రశ్నాపత్రం మోస్తరు స్థాయిలో ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ (CDP) విభాగంలో భావనాత్మక అవగాహనను పరీక్షించే ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. మ్యాథ్స్, సైన్స్ లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉన్నందున కొన్ని అభ్యర్థులకు అవి సవాలుగా అనిపించాయి. లాంగ్వేజ్ పేపర్లలో గ్రామర్, పాఠ్యాంశాలపై లోతైన అవగాహన ఉందా? లేదా? అనే విషయాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు రూపొందించారు. మొత్తానికి, బేసిక్ కాన్సెప్ట్స్ స్పష్టంగా ఉన్నవారికి పరీక్ష సులభంగా అనిపించింది, కాన్సెప్ట్ క్లారిటీ తక్కువగా ఉన్న వారికి మాత్రం కొంత కఠినంగా అనిపింది. ముఖ్యంగా టైమ్ మేనేజ్‌మెంట్ ఈ పరీక్షలో విజయానికి ముఖ్యమైన అంశంగా నిలిచింది.
TG TET 2026లో ప్రశ్నల తీరు ఎలా ఉండొచ్చు? ఏమేమి మార్పులు ఉండే అవకాశం? (What might the question pattern be like in TG TET 2026? What are the possible changes?)
TG TET 2026లో పరీక్షలో సిలబస్‌లో పెద్ద మార్పులు ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ప్రశ్నల తీరు ఎక్కువగా కాన్సెప్ట్-ఆధారంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ (CDP), మ్యాథ్స్, సైన్స్ లాంటి విభాగాల్లో అప్లికేషన్-ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా రావచ్చు.కేవలం పాఠాలు చదివినంత మాత్రాన సరిపోదు, లోతైన అవగాహనతో, ప్రాక్టికల్ ఆలోచనతో సిద్ధం కావాలి. కొత్త విద్యా విధానం (NEP)కి సంబంధించిన విషయాలు కూడా ప్రశ్నల్లో కనిపించే అవకాశం ఉంది, కాబట్టి అభ్యర్థులు బేసిక్స్ పై పట్టు పెంచుకుని , ప్రాక్టికల్ దృష్టితో చదవడం మంచిది.
TG TET 2026 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇప్పటినుంచే సీరియస్‌గా ప్రిపేర్ కావడం మంచిది. అధికారిక నోటిఫికేషన్ ఎప్పుడూ వచ్చిన , ముందస్తు ప్రిపరేషన్ ఉన్నవారికి మాత్రమే లాభం ఉంటుంది. గత పరీక్షల అనుభవాన్ని ఆధారంగా తీసుకుని కాన్సెప్ట్‌లపై పట్టు పెంచుకోవడం, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం విజయానికి దారి తీస్తుంది. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో చదివితే TG TETలో మంచి ఫలితాలు సాధ్యం.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.










