TS Gurukulam Notification 2023: తెలంగాణ రాష్ట్రంలో 4006 ఉద్యోగాలకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవే

Rudra Veni

Published On:

తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (TS Gurukulam Notification 2023) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4006 టీజీటీ పోస్టులను భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
TS Gurukulam Notification 2023: తెలంగాణ రాష్ట్రంలో 4006 ఉద్యోగాలకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవేTS Gurukulam Notification 2023: తెలంగాణ రాష్ట్రంలో 4006 ఉద్యోగాలకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవే

టీఎస్ గురుకులం ఉద్యోగ నోటిఫికేషన్ 2023 (TS Gurukulam Notification 2023): తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో మరో 4006 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (TS Gurukulam Notification 2023) రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4006 టీజీటీ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 27 చివరి తేదీ. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు అర్హతలు, ఎంత జీతం, దరఖాస్తు చేసుకునే విధానాల గురించి ఇక్కడ పూర్తిగా అందజేశాం. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

టీజీటీ 4006 ఉద్యోగ నోటిఫికేషన్

టీజీటీ 4006 పోస్టులు (Total TGT 4006 vacancies)

మొత్తం 4006 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. సొసైటీల వారీగా ఎన్ని పోస్టులున్నాయో ఈ దిగువున పరిశీలించండి.
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ 218
మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ 2379
తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యిట్యూషన్స్ సొసైటీ 728
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TREIS) 87
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) 594


టీజీటీ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు (Educational Qualifications For TGT Jobs)

తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి విడుదలైన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతలు గురించి ఈ దిగువున అందజేశాం.
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే జనరల్‌ అభ్యర్థులు బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలో 50 శాతం మార్కులు పొంది ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీలో ఆప్షనల్‌ సబ్జెక్టుగా సంబంధిత లాంగ్వేజీ లేదా ఓరియంటల్‌ లాంగ్వేజిలో డిగ్రీ లేదా లిటరేచర్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
  • లేదా సంబంధిత లాంగ్వేజీలో పీజీ డిగ్రీ 50 శాతం మార్కులతో పాటు లాంగ్వేజి పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ లేదా బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలి. దీంతో పాటు టెట్‌ పేపర్‌-2/ సీటీఈటీ అర్హత కూడా పొంది ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు కొంత వెసులుబాటు ఉంది. వీరు డిగ్రీ కోర్సుల్లో 45 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అదేవిధంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

TGT పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ఎలా? How to Apply for TGT Posts

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది.
  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://treirb.telangana.gov.in ని సందర్శించాలి.
  • హోంపేజీలో Apply Online/ One Time Registration (OTR) అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో New Registration (OTR)? అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • అనంతరం అభ్యర్థులు తమ ఆధార్ వివరాలను నమోదు చేయాలి.
  • తర్వాత ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
  • తర్వాత హోం పేజీలో కనిపించే Apply Online ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటీఆర్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి.
  • అక్కడ పూర్తి వివరాలను నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని విద్యా సంబంధిత వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోండి.

/news/treirb-notification-2023-released-for-4006-tgt-posts-check-application-process-here-39778/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top