తెలంగాణ ప్రవేశ పరీక్షల 2025 తేదీలు విడుదల, ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌ల షెడ్యూల్ ఇదే (TS Entrance Exam Dates 2025)
తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ 2025 (TS Entrance exam dates 2025) :
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 2025 అధికారిక పరీక్ష తేదీలను (
TS Entrance exam dates 2025
) ఇక్కడ చూడవచ్చు. అధికారిక షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షలు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీటెక్ లేటరల్ ఎంట్రీ, బి.ఎడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎం.టెక్, ఎంసీఏ వంటి వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్ ఫార్మాట్‌లోనే జరుగతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందించాం. పరిశీలించవచ్చు.
ఇది కూడా చూడండి:
తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షా తేదీలు
తెలంగాణ ప్రవేశ పరీక్ష తేదీలు 2025: పరీక్షల వారీగా షెడ్యూల్ (TS Entrance exam dates 2025)
తెలంగాణ రాష్ట్రంలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే వివిధ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఈ దిగువున టేబుల్లో అందించాం. అభ్యర్థులు చూడవచ్చు.| పరీక్ష పేరు | పరీక్ష తేదీ | కోర్సులు |
|---|---|---|
| TS EAMCET పరీక్ష తేదీ 2025 | ఏప్రిల్ 29 నుంచి 30, 2025 వరకు, మే 2 నుంచి 5, 2025 | ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ |
| TS ECET పరీక్ష తేదీ 2025 | మే 12, 2025 | బీటెక్ లాటరల్ ఎంట్రీ |
| TS ICET పరీక్ష తేదీ 2025 | జూన్ 8 & 9, 2025 | MBA, MCA |
| TS PGECET పరీక్ష తేదీ 2025 | జూన్ 16 నుంచి 19, 2025 వరకు | ఎంటెక్ |
| TS EDCET పరీక్ష తేదీ 2025 | జూన్ 1, 2025 | బీఈడీ |
| TS LAWCET పరీక్ష తేదీ 2025 | జూన్ 6, 2025 | LLB |
| TS PECET పరీక్ష తేదీలు 2025 | జూన్ 11 నుంచి 14, 2025 | గ్రాడ్యుయేషన్/డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ |
2025-26 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష తేదీల షెడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ షెడ్యూల్ ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకోవడానికి, రాబోయే పరీక్షల కోసం వారి అధ్యయన వ్యూహాలను నిర్వహించడానికి తగినంత సమయం ఉందని తెలుస్తుంది. దీని ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ పరీక్షల ద్వారా తమ సమర్థతను నిరూపించుకుని మంచి ర్యాంకులను పొందవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















