TS CPGET 2023 Answer key Out: TS CPGET 2023 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల, త్వరలో ఫలితాలు

Rudra Veni

Published On:

TS CPGET 2023 ఆన్సర్ కీ (TS CPGET 2023 Answer key Out), రెస్పాన్స్ షీట్, ప్రశ్నపత్రాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో? అభ్యంతరాలు ఎలా తెలియజేయాలో? ఇక్కడ చూడండి. 
 
TS CPGET 2023 Answer key Out: TS CPGET 2023 ఆన్సర్ కీ,  రెస్పాన్స్ షీట్ విడుదల, త్వరలో ఫలితాలుTS CPGET 2023 Answer key Out: TS CPGET 2023 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల, త్వరలో ఫలితాలు

TS CPGET 2023 ఆన్సర్ కీ విడుదల (TS CPGET 2023 Answer key Out): ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (TS CPGET) 2023 ఆన్సర్ కీ (TS CPGET 2023 Answer key Out), ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు CPGET 2023కి సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీలను అధికారిక వెబ్‌సైట్ cpget.tsche.ac.inలో చూడవచ్చు. TS CPGET 2023 జూన్ 30 నుంచి జూలై 10 వరకు వివిధ PG, PG డిప్లొమా, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించబడింది. విశ్వవిద్యాలయం PDF ఫార్మాట్‌లో సరైన సమాధానాలతో పాటు సబ్జెక్ట్ వారీగా మాస్టర్ ప్రశ్నపత్రాన్ని అందించింది. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, CPGET హాల్ టికెట్ నెంబర్‌తో లాగిన్ అవ్వడం ద్వారా రెస్పాన్స్ షీట్‌లను చెక్ చేయవచ్చు. ప్రిలిమినరీ ఆన్సర్ కీలపై అభ్యంతరాలు తెలిపేందుకు జూలై 24 చివరి తేదీ. ఆన్సర్ కీ విడుదలైపోవడంతో TS CPGET 2023 ఫలితాలు కూడా త్వరలో విడుదలకానున్నాయి.

TS CPGET రెస్పాన్స్ షీట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS CPGET Response Sheet 2023?)

రెస్పాన్స్ షీట్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది. అభ్యర్థులు ఈ కింది దశలను అనుసరించడం ద్వారా వారి రెస్పాన్స్ షీట్‌ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులు గమనించాలి.

స్టెప్ 1. ముందుగా అభ్యర్థులు అధికారిక TS CPGET 2023 వెబ్‌సైట్ cpget.tsche.ac.in కి వెళ్లండి.
స్టెప్ 2."TS CPGET రెస్పాన్స్ షీట్ 2023ని డౌన్‌లోడ్ చేయండి" అని సూచించే ట్యాబ్/లింక్‌ని గుర్తించి దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 3. తర్వాత పేజీ లాగిన్ పోర్టల్‌కు రీ డైరక్ట్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఫీల్డ్‌లలో తమ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 4. Submitపై క్లిక్ చేయాలి.
స్టెప్ 5. అభ్యర్థులు తమ డివైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి, చెక్ చేయడానికి రెస్పాన్స్ షీట్ డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడుతుంది.

TS CPGET 2023 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ ప్రశ్నలు, ప్రతిస్పందనలను (సమాధానాలు) ప్రశ్నాపత్రం మాస్టర్ కాపీ, దాని ప్రిలిమినరీ కీకి సంబంధించి సరిపోల్చి చూసుకోవాలి. అదే విధంగా దరఖాస్తుదారులు తమ అభ్యంతరాలను కన్వీనర్ CPGET, DoA, ఉస్మానియా యూనివర్సిటీ కార్యాలయంలో సమర్పించాలి. లేదా cpget2023@gmail.comకి మెయిల్ చేయవచ్చు. సబ్జెక్ట్ నిపుణులు దరఖాస్తుదారులు అందజేసిన సవాళ్లను విశ్లేషించి, ఆపై ఫైనల్ ఆన్సర్ కీని జారీ చేస్తారు. TS CPGET ఫలితాలు 2023 ఫైనల్ ఆన్సర్ కీల ఆధారంగా విడుదల చేయబడతాయి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ts-cpget-2023-answer-key-and-response-sheet-released-at-cpget-tsche-ac-in-43362/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top