![TS CPGET 2023 Notification: TS CPGET నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలు, అర్హతలు ఇక్కడ తెలుసుకోండి](https://media.collegedekho.com/media/img/news/TS_CPGET_2023_.png?height=310&width=615)
TS CPGET 2023 నోటిఫికేషన్ (TS CPGET 2023 Notification):
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో PG (MA,MSC,MCom) కోర్సులు, PG డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షని (TS CPGET 2023) నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని (TS CPGET 2023 Notification) ఓయూ రిలీజ్ చేసింది. ఈ TS CPGET 2023 ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు మే 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
TS CPGET 2023కు మే 12 నుంచి జూన్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. జూన్ చివరి వారంలో పరీక్ష ఉంటుంది. ఆలస్య రుసుము రూ.500, రూ.2000లతో జూన్ 20 వ రకు దరఖాస్తు సబ్మిట్ చేయవచ్చు. TS CPGET 2023 పరీక్షలో క్వాలిఫై అయినవాళ్లు యూనివర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం http://www.ouadmissions.com/doa/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ఈ దిగువున టేబుల్లో TS CPGET 2023 నోటిఫికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS CPGET 2023 నోటిఫికేషన్ లింక్ |
---|
టీఎస్ సీపీజీఈటీ 2023 ముఖ్యమైన తేదీలు (TS CPGET 2023 Important Dates)
TS CPGET 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఉన్న టేబుల్లో అందజేశాం.
TS CPGET 2023 | ముఖ్యమైన తేదీలు |
---|---|
TS CPGET 2023 అప్లికేషన్ ప్రారంభం | మే 12, 2023 |
TS CPGET 2023 అప్లికేషన్‌కి చివరి తేదీ | జూన్ 11, 2023 |
రూ.500 ఆలస్య రుసుముతో చివరి తేదీ | జూన్ 18, 2023 |
రూ.2000 ఆలస్య రుసుముతో చివరి తేదీ | జూన్ 20, 2023 |
TS CPGET కోసం ఎలా దరఖాస్తు చేయాలి (How to Apply for OUCET TS CPGET)
- TS CPGET 2023 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- “ఆన్లైన్లో దరఖాస్తు చేయి” బటన్‌పై క్లిక్ చేయాలి.
- వ్యక్తిగత, అకడమిక్, సంప్రదింపు నెంబర్ మొదలైన దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి వివరాలను నమోదు చేయాలి.
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి
- దరఖాస్తు ఫార్మ్ కోసం ఫీజు ఆన్లైన్ మోడ్‌లో సబ్మిట్ చేయవచ్చు.
- భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫార్మ్, ఫీజు రసీదు ప్రింట్ తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.