టీఎస్ దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసింది, మే 6 నుంచి రిజిస్ట్రేషన్ (TS DOST Notification 2024)

Rudra Veni

Published On:

తెలంగాణలోని డిగ్రీ ప్రవేశాల కోసం టీఎస్ దోస్త్ 2024 నోటిఫికేషన్ (TS DOST Notification 2024) విడుదలైంది. మొత్తం మూడు విడ‌త‌ల్లో అడ్మిష‌న్ల ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ముఖ్యమైన తేదీలు, రిజిస్ట్రేషన్ విధానం అందించాం. 
 
టీఎస్ దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసింది, మే 6 నుంచి రిజిస్ట్రేషన్  (TS DOST Notification 2024)టీఎస్ దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసింది, మే 6 నుంచి రిజిస్ట్రేషన్ (TS DOST Notification 2024)

టీఎస్ దోస్త్ 2024 నోటిఫికేషన్ (TS DOST Notification 2024) : తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో జాయిన్ అయ్యేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ‌ (TS DOST 2024) నోటిఫికేష‌న్ (TS DOST Notification 2024) శుక్రవారం అంటే మే 3వ తేదీన రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం మూడు విడ‌త‌ల్లో అడ్మిష‌న్ల ప్రక్రియ సాగుతుంది. TS DOST 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 6వ తేదీ నుంచి మే 25 వరకు సాగుతుంది. అలాగే రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 4వ తేదీ నుంచి 13 వరకు, మూడో విడుత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 25 వరకు జరుగుతుంది. టీఎస్ దోస్త్‌కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఈ దిగువున అందించాం.

టీఎస్ దోస్త్ 2024 ముఖ్యమైన తేదీలు (TS DOST 2024 Important Dates)

టీఎస్ దోస్త్ 2024 ముఖ్యమైన తేదీల గురించి ఈ దిగువున టేబుల్లో అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

ఈవెంట్

తేదీ

అధికారిక TS DOST అడ్మిషన్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది

మే 03, 2024

మొదటి దశ TS DOST 2024 నమోదు తేదీలు

మే 6 నుంచి 25 2024 వరకు

వెబ్ ఎంపికలు – దశ 1

మే 15 నుంచి మే 27, 2024 వరకు

సీట్ల కేటాయింపు - ఫేజ్ 1

జూన్ 03, 2024

ఫేజ్ 1 రిపోర్టింగ్

జూన్ 4 నుంచి 10, 2024 వరకు

ఫేజ్ 2 రిజిస్ట్రేషన్

జూన్ 4 నుంచి 13, 2024 వరకు

ఫేజ్వె 2 వెబ్ ఆప్షన్లు

జూలై 2024

ఫేజ్ 2 సీట్ల కేటాయింపు

జూన్ 18, 2024

ఫేజ్ 2 రిపోర్టింగ్

జూన్ 19 నుండి 24, 2024 వరకు

ఫేజ్ 3 రిజిస్ట్రేషన్

జూన్ 19 నుండి 25, 2024 వరకు

ఫేజ్ 3 వెబ్ ఆప్షన్లు

జూన్ 19 నుండి 26, 2024 వరకు

ఫేజ్ 3 సీట్ల కేటాయింపు

జూన్ 29, 2024

రిపోర్టింగ్

జూలై 03, 2024


TS DOST రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 (TS DOST Registration 2024 Process)

TS DOST రిజిస్ట్రేషన్ విధానం గురించి ఈ దిగువున వివరంగా అందించాం. అభ్యర్థులు ఈ విధానాన్ని ఫాలో అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులు ముందుగా దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.inని సందర్శించాలి.
  • హోంపేజీలో "Candidate Pre-Registration" అని ఉండే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టాలి.
  • ముందుగా Application Fee Payment ఆప్షన్‌ను ఎంచుకుని, ఫీజును చెల్లించాలి.
  • తర్వాత Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ts-dost-registration-2024-date-52428/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top