తెలంగాణ రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి (TS DSC Notification 2023 PDF) టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇక్కడ పొందండి.
TS DSC Notification 2023 PDF: 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయంటే?
టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ పీడీఎఫ్ (TS DSC Notification 2023 PDF):
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5089 టీచర్ పోస్టుల భర్తీ కోసం DSC, టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ 2023 విడుదలైంది. ఈ నోటీఫికేషన్ (TS DSC Notification 2023 PDF) ద్వారా తెలంగాణలోని వివిధ సంస్థల్లో స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్ లేదా లాంగ్వేజ్ పండిట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థుల అక్టోబర్ 21వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఖాళీలకు సంబంధించిన పరీక్షలు నవంబర్ 20 నుంచి 30 వరకు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను, వివరాలన్నీ సెప్టెంబర్ 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
TS DSC ఖాళీల 2023 వివరాలు (TS DSC Vacancy 2023 Details)
తెలంగాణ రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులు TS DSC (TRT) రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టుగా ఐదు వేలకుపైగా పోస్టుల భర్తీ చేయనున్నారు. ఖాళీలకు సంబంధించిన వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది.
|
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
|
1789
|
|---|
|
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
|
164
|
|
సెకండరీ గ్రేడ్ టీచర్
|
2575
|
|
లాంగ్వేజ్ పండింట్
|
611
|
తెలంగాణలో జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు వివరాలు (TS DSC Notification 2023 District wise vacancy)
తెలంగాణలో జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
|
ఆదిలాబాద్
|
275
|
|---|
|
ఆసిఫాబాద్
|
289
|
|
భద్రాది కొత్త గూడెం
|
185
|
|
హనుమకొండ
|
54
|
|
హైదరాబాద్
|
58
|
|
జగిత్యాల
|
148
|
|
జనగాం
|
76
|
|
జయశంకర్ భూపాలపల్లి
|
74
|
|
జోగులాంబ
|
146
|
|
కామారెడ్డి
|
200
|
|
కరీంనగర్
|
99
|
|
ఖమ్మం
|
195
|
|
మహబూబాబాద్
|
125
|
|
మహబూబ్ నగర్
|
96
|
|
మంచిర్యాల
|
113
|
|
మెదక్
|
147
|
|
మేడ్చల్
|
78
|
|
ములుగు
|
65
|
|
నాగర్ కర్నూల్
|
114
|
|
నల్గొండ
|
219
|
|
నారాయణ పేట
|
154
|
|
నిర్మల్
|
115
|
|
నిజామాబాద్
|
309
|
|
పెద్దపల్లి
|
43
|
|
రాజన్న సిరిసిల్ల
|
103
|
|
రంగారెడ్డి
|
196
|
|
సంగారెడ్డి
|
283
|
|
సిద్ది పేట
|
141
|
|
సూర్యాపేట
|
185
|
|
వికారాబాద్
|
191
|
|
వనపర్తి
|
76
|
|
వరంగల్
|
138
|
|
యాదాద్రి
|
99
|
తెలంగాణ డీఎస్సీ అర్హత ప్రమాణాలు (TS DSC Eligibility Criterias 2023)
తెలంగాణ డీఎస్సీ అర్హత ప్రమాణాలకు సంబంధించిన వివరాలను దిగువున అందించాం.
-
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed.)తో డిగ్రీ చేసి ఉండాలి.
-
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు
- 50 శాతంతో ఇంటర్మీడియట్, 2 సంవత్సరాల DElEd, TSTET/APTET/CTET పేపర్ 1 పూర్తి చేసి ఉండాలి
.
-
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు
- సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా 4 సంవత్సరాల B.A.B.Ed. / B.Sc.B.Ed. TSTET/APTET/CTET పేపర్ 1తో కనీసం 50% మార్కులతో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ.
-
భాషా పండిట్ పోస్టులకు
– ఏదైనా UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Edతో తెలుగు / హిందీ / ఉర్దూ / కన్నడ / ఒరియా / తమిళం / సంస్కృతంలో డిగ్రీ పొంది ఉండాలి.
-
అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.1000ల దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ః
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.