TS EAMCET Application form 2023 Closing Today: టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తుకు నేడే చివరి తేదీ, ఇలా అప్లై చేసుకోండి

Rudra Veni

Published On:

ఎటువంటి లేట్ ఫీజు లేకుండా TS EAMCET 2023 దరఖాస్తు ఫార్మ్ 2023ని సబ్మిట్  చేయడానికి ఈరోజే  (TS EAMCET Application form 2023 Closing Today) చివరి రోజు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి eamcet.tsche.ac.in లో వెంటనే అప్లై చేసుకోండి. 
TS EAMCET Application form 2023 Closing Today: టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తుకు నేడే చివరి తేదీ, ఇలా అప్లై చేసుకోండిTS EAMCET Application form 2023 Closing Today: టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తుకు నేడే చివరి తేదీ, ఇలా అప్లై చేసుకోండి

టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తుకు నేడే లాస్ట్‌డేట్ (TS EAMCET Application form 2023 Closing Today): తెలంగాణ ఎంసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్ సబ్మిట్ చేయడానికి ఈరోజే లాస్ట్‌డేట్. అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఈరోజే (ఏ్రప్రిల్ 10, 2023) చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి eamcet.tsche.ac.in లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

టీఎస్ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS EAMCET 2023 Important Dates)

తెలంగాణ ఎంసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10, 2023
దరఖాస్తు కరెక్షన్ విండో ఏప్రిల్ 12 నుంచి 14, 2023
రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ ఏప్రిల్ 15, 2023
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ ఏప్రిల్ 20, 2023
రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ ఏప్రిల్ 25, 2023
రూ.5000 లేట్ ఫీజుతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 02, 2023
TS EAMCET 2023 హాల్ టికెట్ విడుదల తేదీ ఏప్రిల్ 30, 2023
TS EAMCET 2023 పరీక్ష తేదీ అగ్రికల్చర్, మెడిసిన్ మే 10, 11, 2023
ఇంజనీరింగ్ మే 12, 13, 14, 2023

TS EAMCET 2023 - ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to apply to TS EAMCET 2023)

తెలంగాణ ఎంసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.
  • అధికారిక వెబ్‌సైట్‌ను eamcet.tsche.ac.in సందర్శించాలి
  • హోమ్‌పేజీలో "submit the application fee" అనే లింక్‌పై క్లిక్ చేయాలి
  • ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ పూర్తి వివరాలు పూరించాలి
  • తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ సూచనల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌ అవుట్ తీసుకోవాలి.
TS EAMCET 2023 మే నెలలో జరుగుతుంది. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టులలో జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ts-eamcet-2023-application-form-closing-today-38943/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top