TS ECET final phase Counselling Dates 2023: TS ECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Published On:

TS ECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2023  (TS ECET final phase Counselling Dates 2023) ఈ దిగువున అందజేయడం జరిగింది. కౌన్సెలింగ్ నమోదు, వెబ్ ఆప్షన్ల సబ్మిట్ చేయడం,  సీటు కేటాయింపు విడుదల కోసం వివరణాత్మక షెడ్యూల్‌ను ఇక్కడ తెలుసుకోండి.
TS ECET Final Phase Counselling Dates 2023TS ECET Final Phase Counselling Dates 2023

TS ECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2023 (TS ECET final phase Counselling Dates 2023): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ TS ECET 2023 చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు ఆన్‌లైన్‌లో దాని అధికారిక పోర్టల్ tsecet.nic .లో విడుదల చేసింది. TS ECET కౌన్సెలింగ్ 2023 చివరి దశ TS ECET final phase Counselling Dates 2023) ఆగస్టు 20, 2023న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ప్రారంభం అవుతుంది. ఇంకా కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోని అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ప్రాథమిక వివరాలను పూరించాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. కౌన్సెలింగ్‌ని కొనసాగించడానికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ని అనుసరించాలి. సర్టిఫికెట్‌లను ధ్రువీకరించిన తర్వాత అభ్యర్థులు వెబ్ ఆప్షన్‌లను ఎంచుకోవడానికి, వాటిని లాక్ చేయడానికి విండో ఇవ్వబడుతుంది. ప్రొవిజనల్ TS ECET సీట్ల కేటాయింపు 2023 ఆగస్ట్ 26, 2023న లేదా అంతకు ముందు విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ట్యూషన్ ఫీజు చెల్లించి, కేటాయించిన కాలేజీలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి | Who is Eligible for TS ECET Final Phase Counselling 2023?

TS ECET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2023 (TS ECET Final Phase Counseling Dates 2023)

TS ECET 2023 చివరి దశ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ దిగువున ఇవ్వడం జరిగింది.

ఈవెంట్ వివరణ

తేదీ

కౌన్సెలింగ్ నమోదు (మొదటి దశలో నమోదు చేసుకోని వారికి)

ఆగస్టు 20 నుంచి ఆగస్టు 21, 2023 వరకు

సర్టిఫికేట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఆగస్టు 22, 2023

వెబ్ ఎంపికల ప్రాధాన్యతలను అమలు చేయడం

ఆగస్టు 20 నుండి ఆగస్టు 23, 2023 వరకు

వెబ్ ఎంపికల ఫ్రీజింగ్

ఆగస్టు 23, 2023

ప్రొవిజనల్ తుది దశ సీట్ల కేటాయింపు విడుదల

ఆగస్టు 26, 2023

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్

ఆగస్టు 26 నుంచి ఆగస్టు 29, 2023 వరకు

అడ్మిషన్ కోసం కేటాయించబడిన కళాశాలలో ఫిజికల్ రిపోర్టింగ్

ఆగస్టు 26 నుంచి ఆగస్టు 30, 2023 వరకు (పని వేళల్లో మాత్రమే)

ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు .

/news/ts-ecet-final-phase-counselling-dates-2023-43850/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top