TS ICET 2025 హాల్ టికెట్లు విడుదల జూన్ 1కి వాయిదా

manohar

Updated On: May 28, 2025 11:30 AM

TS ICET 2025 హాల్ టికెట్లు విడుదల తేదీని జూన్ 01, 2025 (ఆదివారం) గా ప్రకటించారు. ముందుగా ఈ తేదీ మే 28, 2025 గా నిర్ణయించబడింది, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల తేదీని జూన్ 01 కి వాయిదా వేశారు.

TS ICET 2025 హాల్ టికెట్ జూన్ 1కి వాయిదాTS ICET 2025 హాల్ టికెట్ జూన్ 1కి వాయిదా

TS ICET 2025 హాల్ టికెట్ జూన్ 1కి వాయిదా(TS ICET 2025 Hall Ticket postponed to June 1): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) నిర్వహించే TS ICET 2025 (తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) హాల్ టికెట్ల విడుదల తేదీని అధికారికంగా (TS ICET 2025 Hall Ticket postponed to June 1) వాయిదా వేశారు. ముందుగా మే 28న విడుదల చేయాలని భావించినా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీనిని జూన్ 1, 2025కు మార్చారు.ఈ పరీక్ష ద్వారా MBA ,MCA కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు ఎంపిక చేయబడతారు.

TS ICET 2025 హాల్ టికెట్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.in లో విడుదల చేస్తుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, జన్మతేది,అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి లాగిన్ అయి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.అభ్యర్థులు హాల్ టికెట్ విడుదల అయిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలో ప్రవేశం అనుమతించబడదు. TS ICET 2025 పరీక్ష జూన్ 8,9 తేదీల్లో, CBT మోడ్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) లో జరుగుతుంది. ఈ రెండు రోజులలో ప్రతి రోజూ రెండు షిఫ్టులు ఉంటాయి.

TS ICET 2025 హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download TS ICET 2025 hall ticket)

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.inని సందర్శించాలి.
  • ఆ తరువాత “డౌన్‌లోడ్ హాల్ టికెట్” లింక్ పై క్లిక్ చేయండి.
  • తద్వారా, మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ (DD/MM/YYYY) ,అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
  • హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • దానిని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
  • భవిష్యత్తు ఉపయోగం కోసం భద్రపరచండి.

TS ICET 2025 హాల్ టికెట్‌లో ఉండే వివరాలు (Details in TS ICET 2025 Hall Ticket)

  • అభ్యర్థి పేరు
  • రోల్ నెంబర్/రిజిస్ట్రేషన్ నెంబర్
  • అభ్యర్థి ఫోటోగ్రాఫ్
  • అభ్యర్థి సంతకం
  • పుట్టిన తేదీ
  • కేటగిరి
  • జెండర్
  • పరీక్ష తేదీ
  • పరీక్షా స్థలం చిరునామా
  • పరీక్ష వ్యవధి
  • రిపోర్టింగ్ సమయం
  • పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు

TS ICET 2025 పరీక్షా వివరాలు(TS ICET 2025 Exam Details)

TS ICET 2025 పరీక్షా రెండు సెషన్లుగా జరుగుతుంది.పరీక్షా తేదీలు, సమయం గురించి ఈ క్రింది పట్టికలో ఇవ్వబడింది.

తేదీలు

సమయం

TS ICET 2025 జూన్ 08, (ఆదివారం)మొదటి సెషన్

ఉదయం 10:00 గంటల నుండి 12:30 వరకు

TS ICET 2025 జూన్ 08, (ఆదివారం)రెండవ సెషన్

మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:00 వరకు

TS ICET 2025 జూన్ 09,(సోమవారం)మొదటి సెషన్

ఉదయం 10:00 గంటల నుండి 12:30 వరకు

TS ICET 2025 జూన్ 09,(సోమవారం)మొదటి సెషన్

మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:00 వరకు

TS ICET 2025 హాల్ టికెట్‌ను పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి. పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు, హాల్ టికెట్‌తో పాటు ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డు) తీసుకెళ్లడం తప్పనిసరి.పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి.నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ts-icet-2025-hall-ticket-release-postponed-to-june-1-66765/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top