TS ICET Hall Ticket 2023Claude Live Session by Experts
Practical · No theory · See it work live
Saturday, 6 June
11 AM – 1 PM
2 HOURS
TS ICET హాల్ టికెట్ 2023 (TS ICET 2023 Hall Ticket): కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ TS ICET 2023 హాల్ టికెట్‌ని ఈ రోజు (22 మే 2023) విడుదల చేయడం జరిగింది. సంబంధిత డైరక్ట్ లింక్‌ని ఈ దిగువున అందజేయడం జరిగింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు icet.tsche.ac.in లో TS ICET హాల్ టికెట్ 2023ని చెక్ చేయవచ్చు. TS ICET 2023 హాల్ టికెట్‌ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ లాగిన్ వంటి అవసరమైన లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. మునుపటి సంవత్సరం ట్రెండ్స్ ప్రకారం అభ్యర్థులు మధ్యాహ్నం లేదా సాయంత్రం హాల్ టికెట్లను పొందవచ్చు. TS ICET హాల్ టికెట్‌లో (TS ICET 2023 Hall Ticket) ముఖ్యమైన డీటెయిల్స్ , అలాగే పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు, పరీక్ష రోజు పాటించాల్సిన సూచనలతో పాటు అభ్యర్థి వ్యక్తిగత సమాచారం ఇక్కడ అందజేయడం జరిగింది. అభ్యర్థులు హాల్ టికెట్‌లో ఉన్న వివరాలను సరిచూసుకోవాలి.
TS ICET హాల్ టికెట్ 2023 డైరెక్ట్ లింక్: Click Here |
|---|
TS ICET హాల్ టికెట్ 2023 విడుదల తేదీ, సమయం (TS ICET Hall Ticket 2023 Release Date and Time)
ఈ దిగువన ఉన్న అభ్యర్థి TS ICET 2023 హాల్ టికెట్ విడుదల తేదీని సమయంతో పాటు చెక్ చేయవచ్చు.
ఈవెంట్స్ | తేదీ & సమయం |
|---|---|
TS ICET 2023 హాల్ టికెట్ విడుదల తేదీ | 22 మే 2023 |
హాల్ టికెట్ ప్రకటన సమయం | 11:25 AM |
TS ICET పరీక్ష తేదీ 2023 | 26 & 27 మే 2023 |
TS ICET 2023 హాల్ టికెట్‌లో ఉండే వివరాలు (TS ICET 2023 Hall Ticket: Details Present)
ఈ దిగువన ఉన్న అభ్యర్థి TS ICET 2023 హాల్ టికెట్‌లో ఉన్న వివరాలని ఇక్కడ చెక్ చేయవచ్చు.
- అభ్యర్థి పేరు
- తండ్రి పేరు
- అతను/ఆమె చెందిన కేటగిరి
- అభ్యర్థి సంప్రదింపు సమాచారం
- పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు
- రిపోర్టింగ్ సమయం
- పరీక్షా కేంద్రం పూర్తి చిరునామా
- పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సూచన
TS ICET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్ (Steps To Download the TS ICET Hall Ticket 2023)
TS ICET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్స్‌ని ఇక్కడ చెక్ చేయండి.
స్టెప్ 1: | అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.in ని సందర్శించండి |
|---|---|
స్టెప్ 2: | హోంపేజీలో లేటెస్ట్ అప్‌డేట్ సెక్షన్‌కి నావిగేట్ అవ్వండి. హాల్ టికెట్ లింక్ కోసం వెదకండి |
స్టెప్ 3: | తర్వాత అభ్యర్థి కొత్త పేజీకి రీడైరక్ట్ అవుతారు. అక్కడ అభ్యర్థులు అవసరమైన లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. |
స్టెప్ 4: | అభ్యర్థి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్‌ని యాక్సెస్ చేయడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి |
స్టెప్ 5: | అభ్యర్థి పరీక్ష రోజు హాల్ టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. |
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు రాయవచ్చు.

