తెలంగాణ ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తేదీలు ఇవే, ఇలా దరఖాస్తు చేసుకోండి

Andaluri Veni

Updated On: April 24, 2024 06:32 pm IST

తెలంగాణ ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తేదీలు 2024 ఈరోజు, ఏప్రిల్ 24న విడుదల చేశారు. విద్యార్థులు వివరణాత్మక షెడ్యూల్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం ఇక్కడ చూడవచ్చు.
TS Inter Revaluation and Recounting Dates 2024 (Image credit: Pexels)TS Inter Revaluation and Recounting Dates 2024 (Image credit: Pexels)

తెలంగాణ ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తేదీలు 2024  (TS inter Revaluation Dates 2024) : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, TSBIE TS ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తేదీలను (TS inter Revaluation Dates 2024) ఈరోజు ఏప్రిల్ 24, 2024న విడుదల చేసింది. తమ పేపర్‌లను మళ్లీ చెక్ చేయాలనుకునే అభ్యర్థులు తెలంగాణ ఇంటర్ రీవాల్యుయేషన్‌కు వెళ్లవచ్చు. ఇంటర్ రీ వాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2, 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.  TS ఇంటర్ రీవాల్యుయేషన్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు వారి సంబంధిత కళాశాలలకు వెళ్లవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. తెలంగాణ ఇంటర్ రీవాల్యుయేషన్ ఫలితం 2024 అధికారిక వెబ్‌సైట్‌లో 20 నుంచి 25 రోజుల తర్వాత తాత్కాలికంగా విడుదల చేయబడుతుందని భావించవచ్చు. మరోవైపు, తమ మార్కుల రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీలో వరుసగా TS ఇంటర్ రీకౌంటింగ్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన లింక్ | TS ఇంటర్ ఫలితాల లింక్ 2024

TS ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తేదీలు 2024 (TS Inter Revaluation and Recounting Dates 2024)

తెలంగాణ ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తేదీలు 2024ని ఇక్కడ ఇచ్చిన టేబుల్‌లో చూడండి:

ఈవెంట్స్

తేదీలు

TS ఇంటర్ రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ

ఏప్రిల్ 25, 2024

TS ఇంటర్ రీవాల్యుయేషన్ ముగింపు తేదీ

మే 02, 2024

TS ఇంటర్ రీవాల్యుయేషన్ ఫలితం

రిజిస్ట్రేషన్ చివరి తేదీ నుంచి 25 రోజుల్లోపు వెల్లడవుతుంది. (అంచనా)

ముఖ్యమైన లింక్: TS ఇంటర్ టాపర్స్ జాబితా 2024: మొదటి, రెండో సంవత్సరం జిల్లాల వారీగా మంచి మార్కులు పొందిన విద్యార్థులు

TS ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ 2024: ముఖ్యమైన సూచనలు (TS Inter Revaluation and Recounting 2024: Important Instructions)

TS ఇంటర్ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ 2024కి సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి:

  • రీ-వాల్యుయేషన్ ప్రక్రియలో నమోదు చేసుకోవడానికి, అభ్యర్థులు TS ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ వంటి వివరాలను కలిగి ఉండాలి. రీకౌంటింగ్ లేదా మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకునే లింక్ TSBIE పోర్టల్‌లో ఓపెన్ అవుతుంది. విద్యార్థులు తమ కళాశాలల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
  • అభ్యర్థులు రీవాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ కోసం రూ.600లు చెల్లించాల్సి ఉంటుంది.  విజయవంతమైన చెల్లింపు తర్వాత, అభ్యర్థులు రసీదు సంఖ్యను గమనించాలి
  • అభ్యర్థులు చివరి తేదీలోపు TS ఇంటర్ రీవాల్యుయేషన్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు దీని కోసం ఎటువంటి అభ్యర్థనను స్వీకరించదు
  • TS ఇంటర్ రీవాల్యుయేషన్ 2024 ఫలితాలు తాత్కాలికంగా మే 2024లో విడుదల చేయబడతాయి.
ఇది కూడా చదవండి |
లింకులు
TS ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2024
TS దోస్త్ కౌన్సెలింగ్ తేదీ 2024
TS ఇంటర్ హైదరాబాద్ జిల్లా టాపర్ల లిస్ట్
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా టాపర్స్

సబ్జెక్ట్ వారీగా టాపర్స్ లిస్ట్...
టాపర్ల లిస్ట్ లింక్
TS ఇంటర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టాపర్స్ 2024
TS ఇంటర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ టాపర్స్ 2024
TS ఇంటర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ టాపర్స్ 2024

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-inter-revaluation-and-recounting-dates-2024-released-52095/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!