
TS ఇంటర్ ఉత్తీర్ణత మార్కులు 2023 (TS Inter Passing Marks for 2023): తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 మే 2023లో ప్రకటించే అవకాశం ఉంది. TS ఇంటర్ ఫలితాలను TSBIE అధికారిక వెబ్‌సైట్ అంటే tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌తో TS ఇంటర్ 2023 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌లో ఎన్ని మార్కులు (TS Inter Passing Marks for 2023) వస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారో ఇక్కడ తెలుసుకోవచ్చు.
TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 ముఖ్యాంశాలు (TS Intermediate Results 2023 Highlights)
విద్యార్థులు తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 గురించి ఇక్కడ విశ్లేషించడం జరిగింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఈ దిగువున అందించడం జరిగింది.ఈవెంట్ | వివరాలు |
---|---|
పరీక్ష నిర్వహణ సంస్థ | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ |
పరీక్ష పేరు | తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023 |
TS ఇంటర్ ఫలితాలు 2023 డిక్లరేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
ఇంటర్ ఫలితాలు తేదీ | మే, 2023 |
అధికారిక వెబ్‌సైట్ | tsbie.cgg.gov.in |
TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 ఉత్తీర్ణత ప్రమాణాలు (TS Intermediate Results 2023 Passing Criteria)
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు పొందాల్సిన కనీస మార్కులు (TS Inter Passing Marks for 2023) గురించి ఈ దిగువున తెలుసుకోవచ్చు.- ఒక విద్యార్థి నిర్దిష్ట సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు సాధించాలి.
- మొత్తంగా TS ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాల 2023లో 1000 మార్కులకు 350 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు.
- దివ్యాంగ విద్యార్థులకు మాత్రం పాస్ మార్కుల్లో కొంత వెసులుబాటు ఇవ్వడం జరిగింది. వీరికి ఉత్తీర్ణత మార్కులు 25 శాతంగా నిర్ణయించడం జరిగింది. అంటే 100కి 25 మార్కులు వస్తే పాసైనట్టే.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 - గ్రేడింగ్ సిస్టమ్ (Telangana Intermediate Results 2023 TS - Grading System)
తెలంగాణ ఇంటర్మీడిట్ ఫలితాలు గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందో ఈ దిగువున టేబుల్లో తెలియజేయడం జరిగింది.
మార్కుల రేంజ్ | మార్కుల పర్సంటేజ్ | గ్రేడ్ |
---|---|---|
750 కంటే ఎక్కువ మార్కులు | 75 శాతం కంటే ఎక్కువ మార్కులు | ఏ |
600 నుంచి 749 మార్కులు | 60% కంటే ఎక్కువ లేదా సమానం, 75% కంటే తక్కువ | బీ |
500 నుంచి 599 మార్కులు | 50% కంటే ఎక్కువ లేదా సమానం, 60% కంటే తక్కువ | సీ |
350 నుంచి 499 మార్కులు | 35% కంటే ఎక్కువ లేదా సమానం, 50% కంటే తక్కువ | డీ |
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



