TS Inter Passing Marks for 2023: తెలంగాణలో ముగిసిన ఇంటర్ ఎగ్జామ్స్, విద్యార్థులు పాస్ అవ్వడానికి కనీస మార్కులు ఎంతంటే?

Andaluri Veni

Updated On: April 04, 2023 10:28 am IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. గత నెల 15 నుంచి మొదలైన పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీతో ముగిశాయి. అయితే ఇంటర్మీడియట్‌లో పాస్ అవ్వడానికి విద్యార్థులు సాధించాల్సిన కనీస మార్కులు (TS Inter Passing Marks for 2023) ఎంతో ఇక్కడ తెలుసుకోండి.  
 
TS Inter Passing Marks for 2023: తెలంగాణలో ముగిసిన ఇంటర్ ఎగ్జామ్స్, విద్యార్థులు పాస్ అవ్వడానికి కనీస మార్కులు ఎంతంటే?TS Inter Passing Marks for 2023: తెలంగాణలో ముగిసిన ఇంటర్ ఎగ్జామ్స్, విద్యార్థులు పాస్ అవ్వడానికి కనీస మార్కులు ఎంతంటే?

TS ఇంటర్ ఉత్తీర్ణత మార్కులు 2023 (TS Inter Passing Marks for 2023): తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 మే 2023లో ప్రకటించే అవకాశం ఉంది. TS ఇంటర్ ఫలితాలను TSBIE అధికారిక వెబ్‌సైట్ అంటే tsbie.cgg.gov.inలో అందుబాటులో  ఉంటాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌తో TS ఇంటర్ 2023 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌లో ఎన్ని మార్కులు (TS Inter Passing Marks for 2023) వస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారో ఇక్కడ తెలుసుకోవచ్చు.

TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 ముఖ్యాంశాలు  (TS Intermediate Results 2023 Highlights)

విద్యార్థులు తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 గురించి ఇక్కడ విశ్లేషించడం జరిగింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఈ దిగువున అందించడం జరిగింది. 
ఈవెంట్వివరాలు
పరీక్ష నిర్వహణ సంస్థతెలంగాణ స్టేట్ బోర్డ్  ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
పరీక్ష పేరుతెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023
TS ఇంటర్ ఫలితాలు 2023 డిక్లరేషన్ మోడ్ఆన్‌లైన్
ఇంటర్ ఫలితాలు తేదీమే, 2023
అధికారిక వెబ్‌సైట్tsbie.cgg.gov.in

TS ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 ఉత్తీర్ణత ప్రమాణాలు (TS Intermediate Results 2023 Passing Criteria)

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు పొందాల్సిన కనీస మార్కులు (TS Inter Passing Marks for 2023) గురించి ఈ దిగువున తెలుసుకోవచ్చు. 
  • ఒక విద్యార్థి నిర్దిష్ట సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు సాధించాలి.
  • మొత్తంగా TS ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాల 2023లో 1000 మార్కులకు 350 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు.
  • దివ్యాంగ విద్యార్థులకు మాత్రం పాస్ మార్కుల్లో కొంత వెసులుబాటు ఇవ్వడం జరిగింది. వీరికి ఉత్తీర్ణత మార్కులు 25 శాతంగా నిర్ణయించడం జరిగింది. అంటే 100కి 25 మార్కులు వస్తే పాసైనట్టే. 


తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 - గ్రేడింగ్ సిస్టమ్ (Telangana Intermediate Results 2023 TS - Grading System)

తెలంగాణ ఇంటర్మీడిట్ ఫలితాలు గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందో ఈ దిగువున టేబుల్లో తెలియజేయడం జరిగింది. 
మార్కుల రేంజ్మార్కుల పర్సంటేజ్గ్రేడ్
750 కంటే ఎక్కువ మార్కులు75 శాతం కంటే ఎక్కువ మార్కులు
600 నుంచి 749 మార్కులు60% కంటే ఎక్కువ లేదా సమానం, 75% కంటే తక్కువబీ
500 నుంచి 599 మార్కులు50% కంటే ఎక్కువ లేదా సమానం, 60% కంటే తక్కువసీ
350 నుంచి 499 మార్కులు35% కంటే ఎక్కువ లేదా సమానం, 50% కంటే తక్కువడీ

తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-intermediate-passing-marks-38783/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!