TS POLYCET 2023 Application form Last Date: TS POLYCET 2023 రిజిస్ట్రేషన్‌కి ఏప్రిల్ 24 చివరి తేదీ, ఇలా దరఖాస్తు చేసుకోండి

Rudra Veni

Published On:

TS POLYCET 2023కి దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 24 చివరి తేది (TS POLYCET 2023 Application form Last Date) . ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు  వెంటనే అప్లై చేసుకోండి. తెలంగాణలో పాలిటెక్నిక్ అడ్మిషన్ కోసం TS POLYCET 2023 మే 17న నిర్వహించబడుతోంది.
 
TS POLYCET 2023 Application Form Last Date April 25TS POLYCET 2023 Application Form Last Date April 25

TS పాలిసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ (TS POLYCET 2023 Application form Last Date): టీఎస్ పాలిసెట్ 2023 దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 24 చివరి తేదీ (TS POLYCET 2023 Application form Last Date). ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 24వ తేదీకల్లా దరకాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) TS POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్ లింక్‌ను క్లోజ్ చేస్తుంది. TS POLYCET 2023 కోసం ఇంకా నమోదు చేసుకోని తెలంగాణ పాలిటెక్నిక్ అభ్యర్థులు తప్పనిసరిగా చివరి తేదీ కంటే ముందుగా అప్లికేషన్ ఫార్మ్ ని పూరించాలి. రూ. 100 ఆలస్య రుసుముతో 25 ఏప్రిల్ 2023 తేదీకల్లా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు గడువులోపు నమోదు చేసుకోవడం చాలా మంచిది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే TS పాలిసెట్ హాల్ టికెట్ 2023 జారీ చేయబడుతుందని విద్యార్థులు తప్పనిసరిగా గుర్తించాలి. టీఎస్ పాలిసెట్ 2023 మే 17న జరగనుంది.

TS POLYCET 2023 Application Form Direct Link

TS పాలిసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు (TS POLYCET 2023 Application Form Dates)

అభ్యర్థులు TS POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించిన ముఖ్యమైన తేదీలని గుర్తుంచుకోవాలి. దానికనుగుణంగా తమ దరఖాస్తులను సబ్మిట్ చేయాలి.

ఈవెంట్

తేదీలు

TS POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా)

ఏప్రిల్ 24, 2023

TS POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ (రూ.100 ఆలస్య రుసుముతో)

ఏప్రిల్ 25, 2023

హాల్ టికెట్ విడుదల మే 7, 2023 నాటికి

TS పాలిసెట్ పరీక్ష తేదీ 2023

మే 17, 2023

TS POLYCET 2023ని అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి సూచనలు (Instructions to Fill TS POLYCET 2023 Application Form)

ఈ దిగువున అందించిన TS POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి పరీక్ష రాసేవారు తప్పనిసరిగా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి.

  • TS POLYCET ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.polycet.sbtet.telangana.gov.in లింక్‌కి వెళ్లాలి.
  • 'TS POLYCET 2023 రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అందించాలి
  • రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి మీ వివరాలు ఉపయోగించి లాగిన్ చేయండి.
  • ఫీజు చెల్లింపు ఆప్షన్‌ను ఉపయోగించి దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • 'అప్లికేషన్ ఆప్షన్'పై క్లిక్ చేసి, అడిగిన వివరాలు నమోదు చేయాలి.
  • ఫోటోగ్రాఫ్‌లు, సంతకాలు వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మీ దరఖాస్తును సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు భవిష్యత్తు అవసరాల కోసం TS POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. .
అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్‌లు, సమాచారం కోసం TS POLYCET 2023 యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూస్తుండాలి.
మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ts-polycet-2023-application-form-last-date-april-24-instructions-to-apply-online-39307/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top