తెలంగాణ 10వ తరగతి పరీక్ష తేదీ 2023(TS SSC Time Table 2023) విడుదల చేయబడింది: సబ్జెక్ట్ వారీగా టైమ్‌టేబుల్‌ని ఇక్కడ చూడండి.

Guttikonda Sai

Updated On: January 05, 2023 11:28 am IST

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3, 2023 తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 11 పేపర్లకు బదులు 6 పేపర్లకే పరీక్షలు జరగనున్నాయి. TS SSC 10వ తరగతి పరీక్ష తేదీలను(TS SSC Time Table 2023) విద్యార్థులు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

తెలంగాణ 10వ తరగతి పరీక్ష తేదీ 2023(TS SSC Time Table 2023) విడుదల చేయబడింది: సబ్జెక్ట్ వారీగా టైమ్‌టేబుల్‌ని ఇక్కడ చూడండి.

తెలంగాణ 10వ తరగతి పరీక్ష తేదీలు(TS SSC Time Table 2023)  : తెలంగాణ విద్యా శాఖ మంత్రి శ్రీ సబిత ఇంద్రా రెడ్డి గారు 10వ తరగతి పరీక్ష తేదీల సమాచారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సమాచారం ప్రకారం తెలంగాణ 10వ తరగతి పరీక్షలు(TS SSC Time Table 2023)  3 ఏప్రిల్  2023 నుండి 13 ఏప్రిల్  2023 వరకూ జరగనున్నాయి. 2023 మార్చి నెలలో విద్యార్థులు తమ పాఠశాలల నుండి వారి హాల్ టికెట్ లను పొందవచ్చు. ఈ విద్యా సంవత్సరం పరీక్షా విధానంలో కొన్ని మార్పులు జరిగాయి, గతంలో విద్యార్థులు 11 పేపర్ల కు పరీక్షలు రాయాల్సి ఉండగా ఈ సంవత్సరంలో మాత్రం కేవలం 6 పెపర్లకే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 

క్రింద వివరించబడిన టేబుల్ లో విద్యార్థులు వారి పరీక్ష తేదీలను గమనించవచ్చు. 

సబ్జెక్టు పేరు

పరీక్ష తేదీ

తెలుగు / మొదటి లాంగ్వేజ్ పేపర్

ఏప్రిల్ 3,2023

హిందీ 

ఏప్రిల్ 4, 2023

ఇంగ్లీష్ 

ఏప్రిల్ 6, 2023

గణితం 

ఏప్రిల్ 8, 2023

జనరల్ సైన్స్ 

ఏప్రిల్ 10, 2023

సోషల్ స్టడీస్

ఏప్రిల్ 11, 2023

OSSC ప్రధాన లాంగ్వేజ్ పేపర్ -1 ( ఒకేషనల్ కోర్సు)

ఏప్రిల్ 12, 2023

OSSC ప్రధాన లాంగ్వేజ్ పేపర్ -2 ( ఒకేషనల్ కోర్సు)

ఏప్రిల్ 13, 2023



పైన వివరించబడిన విధంగా ఈ విద్య సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు 6 పేపర్లకు మాత్రమే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పరీక్షకు ఇచ్చే సమయం 3 గంటలు. జనరల్ సైన్స్ పేపర్ కు ఇచ్చే సమయం 3 గంటల 20 నిమిషాలు. ప్రతీ సబ్జెక్టు కు పాస్ మార్కులు 35. 

తెలంగాణ 10వ తరగతి 2022-23 ప్రశ్న పత్రాల బ్లూ ప్రింట్ కూడా త్వరలో విడుదల కానున్నాయి. ప్రశ్న పత్రాల బ్లూ ప్రింట్ ద్వారా పరీక్షలలో ఇచ్చే ప్రశ్నల విధానాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. 

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు(TS SSC Time Table 2023)  ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. బోర్డు పరీక్షలకు విద్యార్థులు తప్పని సరిగా తమ హాల్ టికెట్లను తీసుకుని వెళ్ళాలి. విద్యార్థులు పరీక్ష తేదీల సమాచారాన్ని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అధికారిక వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్ bse.telangana.gov.in

తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం 2023(TS SSC Exam Pattern 2023) , గత సంవత్సర ప్రశ్న పత్రాలు , 10వ తరగతి ఫలితాలు మొదలైన ముఖ్య సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 


Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-ssc-exam-dates-2023-released-subject-wise-schedule-34737/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!