
TS Police ఎస్ఐ, ఏఎస్ఐ హాల్ టికెట్ 2023 (TS Police SI, ASI Hall Ticket 2023): తెలంగాణలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ఫైనల్ పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. TSLPRB SI హాల్ టికెట్ 2023 (TS Police SI, ASI Hall Ticket 2023) వారి అధికారిక వెబ్‌సైట్‌లో 3 ఏప్రిల్ 2023న విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ TS పోలీస్ SI, ASI హాల్ టికెట్‌ని 6 ఏప్రిల్ 2023 అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in నుంచి TS పోలీస్ SI రాత పరీక్ష హాల్ టికెట్ 2023ని ((TS Police SI, ASI Hall Ticket 2023) డౌన్‌లోడ్ చేసే ప్రక్రియను ఇక్కడ తెలుసుకోవచ్చు.
టీఎస్ పోలీస్ SI హాల్ టికెట్ 2023 వివరాలు (TS Police SI Hall Ticket 2023 Overview)
ఎస్‌ఐ, ఏస్ఐ ఉద్యోగులకు ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఫైనల్ పరీక్షలకు హాజరుకానున్నారు. సంబంధిత పరీక్షకు హాజరు కావడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ SI హాల్ టికెట్ 2023ని తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకుండా ఎవరూ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఉండదు. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు తప్పనిసరిగా అందులో ఉన్న అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో ఏదైనా పొరపాటు కనిపిస్తే పరీక్షకు ముందే అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలి. హాల్ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున చూడండి.నిర్వహణ సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు |
---|---|
TS పోలీస్ SI హాల్ టికెట్ 2023 విడుదల | ఏప్రిల్ 03, 2023 |
పరీక్ష తేదీలు | ఏప్రిల్ 08, 09, 2023 |
హాల్ టికెట్ లభ్యత మోడ్ | ఆన్‌లైన్ |
కేటగిరి | అడ్మిట్ కార్డ్ |
జాబ్ లోకేషన్ | తెలంగాణ |
అధికారిక వెబ్‌సైట్ | www.tslprb.in |
TS పోలీస్ SI రాత పరీక్ష హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download the TS Police SI Written Exam Hall Ticket 2023?)
తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ రాత పరీక్ష హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.inని సందర్శించాలి
- తాజా వార్తల సెక్షన్ గుర్తించాలి.
- తెలంగాణ పోలీస్ SI హాల్ టికెట్ 2023 లింక్ కోసం శోధించి, దానిని ఓపెన్ చేయాలి.
- అవసరమైన మీ వివరాలను అందించాలి
- అప్పుడు అడ్మిట్ కార్డు కనిపిస్తుంది
- TS పోలీస్ SI హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకుని తదుపరి ప్రయోజనాల కోసం హాల్ టికెట్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఏదైనా కారణంతో హాల్ టికెట్ డౌన్‌లోడ్ కాకపోతే support@tslprb.inకు మెయిల్ చేయాలని లేదంటే 9393711110, 9391005006 నెంబర్లలో సంప్రదించవచ్చని నియామక మండలి చైర్మన్ వెల్లడించారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



