TSPSC AEE హాల్ టికెట్ విడుదల చేయబడింది: ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి

Guttikonda Sai

Published On:

TSPSC AEE హాల్ టిక్కెట్లు ( TSPSC AEE Hall Ticket) అధికారిక వెబ్సైటు tspsc.gov.in లో విడుదల చేశారు. ఈ పోస్టుకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించిన లింక్ ద్వారా వారి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC AEE హాల్ టికెట్ విడుదల చేయబడింది: ఈ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి

TSPSC AEE హాల్ టిక్కెట్లు ( TSPSC AEE Hall Ticket) : తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పోస్టులకు పరీక్ష వ్రాయనున్న అభ్యర్థులు వారి హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాష్ట్రంలోని 1540 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు 22 జనవరి 2023 న పరీక్ష నిర్వహించనున్నారు. TSPSC అసిస్టెంట్ ఎగ్జక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు జరుగుతున్న ఈ పరీక్షను రెండు పేపర్లు గా విభజించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 , మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష ఆఫ్లైన్ విధానంలోనే జరుగుతుంది. అభ్యర్థులు వారికి ఇచ్చిన OMR షీట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ హాల్ లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు.
అభ్యర్థులు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి వారి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు

tspsc.gov.in

TSPSC AEE హాల్ టిక్కెట్లను డౌన్లొడ్ చేసుకోవడం ఎలా? ( How to Download TSPSC AEE Hall Tickets?)

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ AEE పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ అనుసరించి వారి హాల్ టికెట్లను డౌన్లొడ్ చేసుకోవచ్చు.

  • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ tspsc.gov.in ఓపెన్ చేయండి.
  • “ TSPSC AEE Hall Ticket” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  • మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి “submit” మీద క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
  • హాల్ టికెట్ ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

TSPSC AEE పరీక్ష ముఖ్యమైన తేదీలు ( TSPSC AEE Important Dates)

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఏఈఈ పరీక్ష కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

కార్యక్రమం

తేదీ

TSPSC AEE హాల్ టిక్కెట్ల విడుదల

17 జనవరి 2023

TSPSC AEE పరీక్ష పేపర్ -1

22 జనవరి 2023 ఉదయం 10 గంటలకు

TSPSC AEE పరీక్ష పేపర్ -2

22 జనవరి 2023 మధ్యాహ్నం 2.30 గంటలకు

/news/tspsc-aee-hall-tickets-released-35416/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top