TSPSC Group 4 Exam 2023 Schedule: TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Rudra Veni

Updated On: February 04, 2023 11:46 AM

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్  (TSPSC Group 4 Exam 2023 Schedule) విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్  సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 పరీక్షా తేదీలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో  ఎగ్జామ్ డేట్‌ను విడుదల చేయడం జరిగింది. 

 
TSPSC Group 4 Exam 2023 Schedule: TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?TSPSC Group 4 Exam 2023 Schedule: TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్ (TSPSC Group 4 Exam 2023 Schedule): తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్ ఖరారైంది. 2023 జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీష్ కమిషన్ వెల్లడించింది. తెలంగాణ గ్రూప్ 4 పరీక్షలో భాగంగా (TSPSC Group 4 Exam 2023 Schedule) పేపర్ 1 ఉదయం 10 నుంచి 12:30 వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం 8,2180 పోస్టులను భర్తీ చేయనుంది. ఆ పోస్టుల్లో జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ , వార్డు ఆఫీసర్‌ పోస్టులు, జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు TSPSC గ్రూప్ప 4 పరీక్షా తేదీలను TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

TSPSC Group 4 పరీక్షా తేదీ (TSPSC Group 4 Exam Date 2023)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్‌కు (TSPSC Group 4 Exam 2023 Schedule) సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
TSPSC గ్రూప్ 4 2023 నోటిఫికేషన్ డిసెంబర్ 1, 2022
TSPSC గ్రూప్ 4 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ డిసెంబర్ 31 ,2022
TSPSC గ్రూప్ 4 దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ ఫిబ్రవరి 3, 2023
TSPS గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్ జూలై 1, 2023
TSPS గ్రూప్ 4 ఎగ్జామ్ హాల్ టికెట్ తెలియాల్సి ఉంది.


TSPSC గ్రూప్ 4 2023 అర్హత ప్రమాణాలు (TSPSC Group 4 2023 Eligibility Criteria)

బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఐదేళ్ల వరకు, దివ్యాంగులకైతే పదేళ్ల పాటు వయస్సులో సడలింపు ఉంటుంది.

TSPSC గ్రూప్ 4 పరీక్షా 2023 విధానం (TSPSC Group 4 Exam 2023 Pattern)

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. TSPSC Group 4 Examకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహించబడుతుంది. TSPSC గ్రూప్ 4 అడ్మిట్ కార్డ్‌లు పరీక్షకు ఏడు రోజుల ముందు విడుదల అవుతాయి.

TSPSC GROUP 4 2023 దరఖాస్తు ఫీజు (TSPSC GROUP 4 2023 Application Fee)

అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో చెల్లించవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.200లను పే చేయాల్సి ఉంటుంది.

/news/tspsc-group-4-exam-2023-schedule-released-36215/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top