VSAT 2023 Results Out: ఫలితాలు విడుదల, రిజల్ట్ కోసం డైరక్ట్ లింక్ ఇదే

Rudra Veni

Published On:

VSAT 2023 ఫేజ్ 1 ఫలితాలు (VSAT 2023 Results Out) రిలీజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాయడం జరిగింది. తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
VSAT 2023 Results Out: ఫలితాలు విడుదల, రిజల్ట్ కోసం డైరక్ట్ లింక్ ఇదేVSAT 2023 Results Out: ఫలితాలు విడుదల, రిజల్ట్ కోసం డైరక్ట్ లింక్ ఇదే

VSAT 2023 ఫేజ్ 1 ఫలితాలు విడుదల (VSAT 2023 Results Out): VSAT 2023 ఫేజ్ 1 పరీక్షా ఫలితాలు (VSAT 2023 Results Out) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ VSAT 2023 స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్ అంటే vignan.ac.inలో చూడవచ్చు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయం దాని B.Tech, BPharma, BSc అగ్రికల్చర్ సైన్స్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం విజ్ఞాన్-స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (VSAT)ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది దరఖాస్తుదారులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ VSAT ఫేజ్ 1 పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి. VSAT 2023 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున వివరంగా తెలియజేయడం జరిగింది.

VSAT 2023 ఫేజ్ 1 పరీక్షా ఫలితాలను (VSAT 2023 Results Out) చెక్ చేసుకోవడానికి ఈ దిగువున డైరక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దానిపై క్లిక్ చేసి డైరక్ట్‌గా తమ ఫలితాలను చూసుకోవచ్చు. స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

VSAT 2023 ఫేజ్ 1 పరీక్షా ఫలితాల డైరక్ట్ లింక్

విశాట్ 2023 ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download VSAT 2023 Results)

విశాట్ 2023 ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • VSAT 2023 ఫలితాల కోసం అభ్యర్థులు vignan.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • తర్వాత హోంపేజీలో "Latest News" అనే విభాగంలోకి వెళ్లాలి
  • ఈ విభాగం కింద ఇవ్వబడిన “VSAT-2023 Phase-1 Results” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేసి "Submit" బటన్‌ను క్లిక్ చేయాలి.
  • స్కోర్‌లను ప్రదర్శిస్తూ స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
  • అది pdf ఫార్మాట్‌లో అందించబడుతుంది.
  • అదే ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

VSAT ఫేజ్ 1 పరీక్షలకు హాజరు కాలేని వారు 2023 మే 1 నుంచి 31వ తేదీ మధ్య జరిగే ఫేజ్ 2 పరీక్షకు హాజరుకావచ్చు. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. విద్యా సంబంధిత వార్తల క ోసం అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకోండి.

/news/vsat-2023-phase-1-results-released-direct-link-here-39939/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top