Visakhapatnam Anganwadi Recruitment 2023: మహిళలకు మంచి ఛాన్స్, పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు

Rudra Veni

Published On:

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలోని అంగన్‌వాడీ పోస్టుల (Visakhapatnam Anganwadi Recruitment 2023)  భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
Visakhapatnam Anganwadi Recruitment 2023: మహిళలకు మంచి ఛాన్స్, పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలుVisakhapatnam Anganwadi Recruitment 2023: మహిళలకు మంచి ఛాన్స్, పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు

విశాఖపట్నం అంగన్‌వాడీ ఉద్యోగాలు (Visakhapatnam Anganwadi Recruitment 2023): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల (AP Anganwadi Jobs 2023) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జిల్లాలోని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 34 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళల మాత్రమే అర్హులు. అతి తక్కువ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏ అర్హతలుండాలో? పూర్తి సమాచారం ఇక్కడ తెలియజేయడం జరిగింది.

ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య (Total Number of Anganwadi Vacant Posts)

అంగన్‌వాడీ కార్యకర్త 02
అంగన్‌వాడీ సహాయకురాలు 32
దరఖాస్తు ప్రారంభ తేదీ 06-06-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 జూన్ 2023

WCD విశాఖపట్నం రిక్రూట్‌మెంట్ అవసరమైన అర్హత ప్రమాణాలు (WCD Visakhapatnam Recruitment Required Eligibility Details)

అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
  • స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలై ఉండాలి
  • తప్పనిసరిగా వివాహితై ఉండాలి
  • పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.అభ్యర్థి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం (WCD Visakhapatnam Recruitment Salary Details)

అంగన్‌వాడీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం అందజేయడం జరుగుతుంది. జీతభత్యాలు వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.
అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు జీతం రూ.11,500లు
మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు జీతం రూ.7000
అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు జీతం రూ.7000లు

ఈ ఉద్యోగాలకు మహిళలు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 15, 2023 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు మహిళలను ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/wcd-visakhapatnam-recruitment-2023-41516/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top