ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET Exam Date 2023 Released) పరీక్షా తేదీలు ఇవే

Andaluri Veni

Updated On: January 25, 2023 10:57 am IST

ఏపీ ఎంసెట్ 2023/ఏపీ ఎప్‌సెట్ 2023కు సంబంధించిన షెడ్యూల్ (AP EAMCET Exam Date 2023 Released) విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీ ఎంసెట్ షెడ్యూల్ వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. 
ఏపీ ఎంసెట్ 2023  (AP EAMCET Exam Date 2023 Released) పరీక్షా తేదీలు ఇవే

ఏపీ ఎసెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ (AP EAMCET Exam Date 2023 Released): ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP  EAP CET 2023 /AP EAMCET 2023) మే 15 నుంచి జరగనుంది. ఏపీ ఎసెంట్ 2023 (AP EAMCET Exam Date 2023 Released)కి సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి 22 వరకు పరీక్షలు జరగనున్నాయి.  

ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2023‌లో (AP  EAP CET 2023 /AP EAMCET 2023) భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఏపీ ఎంసెట్/ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే మొదలవుతున్నాయి. అంటే జూన్ నెలాఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ తేదీలు 

ఏపీ ఎంసెట్ 2023 ఎగ్జామ్ డేట్ (AP EAMCET 2023 Exam Date)

ఏపీ ఎసెంట్ 2023 (AP EAMCET 2023) ఎగ్జామ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు గురించి, ఇతర వివరాలు గురించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు. 
కార్యక్రమం     ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ డేట్
పరీక్ష ప్రారంభంమే 15, 2023
ఎగ్జామ్ ముగింపు తేదీమే 22, 2023
మార్నింగ్ సెషన్ టైమింగ్స్ఉదయం  9 నుంచి మధ్యాహ్నం 12
మధ్యాహ్నం సెషన్ టైమింగ్స్మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు 
అధికారిక వెబ్‌సైట్https://cets.apsche.ap.gov.in


ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023/ AP EAP CET 2023) పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. వివిధ షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ విధానం ఒకేలా ఉంటుంది. అయితే షిప్ట్‌ల్లో ప్రశ్నలు మారుతూ ఉంటాయి. ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్లికేషన్‌ కోసం ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. 

ఇవి కూడా చదవండి - ఏపీ ECET 2023 ఎగ్జామ్ షెడ్యూల్ 

ఏపీ  ఎంసెట్ 2023 (AP EAMCET 2023)కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా APSCHE ద్వారా నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ పరీక్షకు 2023లో ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన వారు కూడా అర్హులు. ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అడ్మిషన్ సమయంలో కచ్చితంగా వారు ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) గురించి అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in చూడొచ్చు. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-exam-date-2023-released-35816/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!