CUET 2023 తేదీలు విడుదల: cuet.samarth.ac.inలో నేటి రాత్రి నుంచే రిజిస్ట్రేషన్

Andaluri Veni

Updated On: February 09, 2023 04:08 pm IST

సీయూఈటీ యూజీ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను యూజీసీ చైర్మన్ ఫిబ్రవరి 09, 2023వ తేదీన ప్రకటించారు. సీయూఈటీ రిజిస్ట్రేషన్ ఈరోజు రాత్రి cuet.samarth.ac.inలో ప్రారంభం కానుంది. సీయూఈటీ యూజీకి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ ఆర్టికల్లో అందజేశాం. 
CUET 2023 Dates ReleasedCUET 2023 Dates Released

సీయూఈటీ యూజీ 2023 ముఖ్యమైన తేదీలు: సీయూఈటీ యూజీ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 9, 2023న UGC ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తన అధికారిక Twitter ఖాతాలో CUET 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలని ప్రకటించారు. సీయూఈటీ 2023కి సంబంధించిన పరీక్షా తేదీలను ముందుగా NTA వెల్లడించింది.  సీయూఈటీ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఈరోజు సాయంత్రం నాటికి విడుదలవుతుంది. ఫిబ్రవరి 09వ తేదీన cuet.samarth.ac.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ అవ్వగా మార్చి 12, 2023 వరకు అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. 

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ద్వారా 2022లో ప్రవేశపెట్టిన పరీక్ష. ఈ ప్రవేశ పరీక్షను NTA నిర్వహిస్తుంది. CUET UG దేశంలోని ఏదైనా సెంట్రల్ యూనివర్శిటీలో అడ్మిషన్‌ని కోరుకునే విద్యార్థులందరికీ సీయూఈటీ యూజీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ, బీఏ, బీకాం  మొదలైన వివిధ కోర్సులలో  అభ్యర్థులకు ప్రవేశాలను కల్పిస్తుంది. 

సీయూఈటీ యూజీ 2023 నోటిఫికేషన్: ముఖ్యమైన తేదీలు

సీయూఈటీ యూజీ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువ పట్టికలో అందించడం జరిగింది. 

ఈవెంట్తేదీలు
షెడ్యూల్ విడుదలఫిబ్రవరి 09, 2023
అప్లికేషన్ ఫార్మ్  ఆన్‌లైన్ సబ్మిషన్ ప్రారంభంఫిబ్రవరి 09, 2023 (సాయంత్రం)
అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్ సబ్మిషన్ ముగింపుమార్చి 12, 2023
అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదలఏప్రిల్ 30, 2023
హాల్ టికెట్ విడుదలమే 2023 రెండో వారం
CUET పరీక్ష తేదీ 2023మే 21 నుండి 31, 2023 వరకు

సీయూఈటీ 2023 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

సీయూఈటీ 2023కి సంబంధించిన షెడ్యూల్‌తో పాటు, ఎంట్రన్స్ పరీక్ష ముఖ్యాంశాలు ఈ కింద తెలియజేయడం జరిగింది. 

  • సీయూఈటీ యూజీ 2023ని కంప్యూటర్ -బేస్డ్ టెస్ట్ (CBT)గా నిర్వహిస్తుంటారు. పరీక్షా కేంద్రాల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో టెస్ట్‌ని నిర్వహిస్తారు. 
  •  క్వశ్చన్ పేపర్‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను (MCQలు)ను ఇస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు. 
  • సీయూఈటీ అప్లికేషన్ ఫార్మ్ 2023తో పాటు అభ్యర్థులకు సమాచార బ్రోచర్ కూడా అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులకు కావలసిన విశ్వవిద్యాలయం గురించి, అర్హతలు, కోర్సులు గురించి తెలుసుకోవచ్చు.
  • సీయూఈటీ యూజీ మూడు విభాగాలను కలిగి ఉంటుంది:
    • సెక్షన్ IA –  13 భాషల్లోని ఆప్షన్‌‌లతో లాంగ్వేజ్ సెక్షన్  
    • సెక్షన్ IB – 20 భాషల్లోని ఆప్షన్‌‌లతో లాంగ్వేజ్ సెక్షన్
    • సెక్షన్ II – 27 సబ్జెక్ట్ ఆప్షన్స్‌తో డొమైన్-నిర్దిష్ట సబ్జెక్ట్‌ల విభాగాలు
    • సెక్షన్ III – జనరల్ టెస్ట్
  • IA, IB, II విభాగాలు ఆప్షనల్ అయితే సెక్షన్ III అభ్యర్థులందరికీ తప్పనిసరి. కచ్చితమైన ప్రశ్నపత్రాన్ని ఇక్కడ చెక్ చేయవచ్చు: CUET Exam Pattern 2023
  • కింది తెలిపిన కాంబినేషనల్‌లో ఒక అభ్యర్థి గరిష్టంగా 9 పరీక్షలను రాయొచ్చు.
    • 2 లాంగ్వేజ్‌లు+6 డొమైన్ నిర్దిష్ట సబ్జెక్టులు+1 జనరల్ టెస్ట్
    • 3 లాంగ్వేజ్‌లు+5 డొమైన్ నిర్దిష్ట సబ్జెక్టులు+1 జనరల్ టెస్ట్
  • పరీక్ష టైం: లాంగ్వేజ్‌లు, డొమైన్-నిర్దిష్ట సబ్జెక్టులు ఒక్కొక్కటి 45 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. జనరల్ టెస్ట్ 60 నిమిషాల పాటు జరుగుతుంది.

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.comతో కూడా రాయవచ్చు. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/cuet-2023-dates-released-registration-to-begin-tonight-at-cuet-samarth-ac-in-36413/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!