NEET MDS 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, మే 2న పరీక్ష

manohar

Updated On: February 23, 2026 02:05 PM

NEET MDS 2026 కు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరీక్ష మే 12,2026న నిర్వహించబడనుంది. అర్హులైన డెంటల్ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

NEET MDS 2026 Application Form Releasing Soon, Here's How to ApplyNEET MDS 2026 Application Form Releasing Soon, Here's How to Apply

NEET MDS 2026 అప్లికేషన్ ఫారం త్వరలో విడుదల (NEET MDS 2026 application form to be released soon): దేశవ్యాప్తంగా PG డెంటల్ కోర్సుల్లో (MDS) ప్రవేశం పొందాలని ఆశించే అభ్యర్థులు కోసం NEET MDS 2026 అప్లికేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్వహిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ natboard.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం అప్లికేషన్ ప్రారంభ తేదీలపై NBEMS నుంచి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు, కానీ రిజిస్ట్రేషన్ విండో ఎప్పుడైనా తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు తాజా అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించడం మంచిది.

అధికారిక షెడ్యూల్ ప్రకారం NEET MDS 2026 పరీక్షను మే 2, 2026న నిర్వహిస్తారు . ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) జరుగుతుంది. మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలుగా ఉండబడుతుంది, దీనిలో రెండు టైమ్-బౌండ్ సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌కు 75 నిమిషాలు, రెండవ సెక్షన్‌కు 105 నిమిషాలు కేటాయించబడతాయి. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ విధానం, పరీక్ష ప్యాటర్న్ మరియు సిలబస్ వంటి ఆంశాలతో నోటిఫికేషన్ NBEMS త్వరలో విడుదల చేయనుంది. కాబట్టి NEET MDS 2026కు సిద్దమవుతున్న అభ్యర్థుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలని సూచిస్తున్నారు.

NEET MDS 2026కు ఎవరు అర్హులు ? అర్హత ప్రమాణాల పూర్తి వివరాలు (Who is eligible for NEET MDS 2026? Complete details of eligibility criteria)

NEET MDS 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు NBEMS నిర్దేశించిన అర్హత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనలను అర్హత పొందినవారికి మాత్రమే ప్రవేశపరీక్షకు హాజరవ్వడానికి అవకాశం ఉంటుంది.

  • భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి BDS డిగ్రీ పొంది ఉండాలి.
  • స్టేట్ డెంటల్ కౌన్సిల్ లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI)లో నమోదు అయి ఉండాలి
  • ప్రొవిజనల్ లేదా పెర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి
  • గుర్తింపు పొందిన డెంటల్ కాలేజీలో ఒక సంవత్సరం రోటేటరీ ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా పూర్తి చేసిన ఉండాలి
  • BDS తుది పరీక్ష పూర్తి చేసి ప్రస్తుతానికీ 12 నెలల ఇంటర్న్‌షిప్‌లో ఉన్నవారైనా, ప్రభుత్వం నిర్దేశించిన కట్-ఆఫ్ తేదీకి ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయగలిగితే NEET MDS 2026కు దరఖాస్తు చేసుకోవచ్చు

NEET MDS 2026 అప్లికేషన్‌కు అవసరమైన పత్రాలు (Documents required for NEET MDS 2026 application)

NEET MDS 2026 అప్లికేషన్ ఫారం ఆన్‌లైన్‌లో నింపే సమయంలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన పత్రాలను స్కాన్ చేసి ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, అవసరమైన అన్ని సర్టిఫికెట్లు సరైన ఫార్మాట్‌లో స్పష్టంగా కనిపించేలా ఉండడం చాలా ముఖ్యం. గుర్తింపు పత్రాలు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వంటి వివరాలు అప్లికేషన్ సమయంలో తప్పక అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలకు ముందు ఈ పత్రాలను సరిగా సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

NEET MDS 2026 డెంటల్ PG అభ్యర్థులకు ముఖ్యమైన పరీక్ష. అధికారిక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ అప్లికేషన్ కు ముందే సిద్ధంగా ఉండటం మంచిది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/neet-mds-2026-application-form-date-eligibility-exam-details-77716/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top