RBI అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025: డిగ్రీ అభ్యర్థులకు 650 ఉద్యోగాలు

manohar

Published On:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశవ్యాప్తంగా 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి వేతనం మరియు స్థిరమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది.దరఖాస్తు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి. 

RBI Joibs 2026RBI Joibs 2026

RBI అసిస్టెంట్ ఉద్యోగాలు 2025 (RBI Assistant Jobs 2025): భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే డిగ్రీ విద్యార్థుల కోసం 650 అసిస్టెంట్ పోస్టుల నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో అభ్యర్థులను నియమిస్తారు. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST/దివ్యాంగ అభ్యర్థులకు పాస్ మార్కులు సరిపోతాయి. ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు భాషా నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,514 ప్రారంభ వేతనం సహా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలని భావించేవారికి ఇది మంచి అవకాశం.

రాష్ట్రాల వారీగా RBI అసిస్టెంట్ పోస్టుల వివరాలు (State-wise RBI Assistant posts details)

RBI విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు/నగరాల్లో మొత్తం 650 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల చెందిన నగరాలూ కూడా ఉన్నాయి.

రాష్ట్రం/ నగరం

పోస్టుల సంఖ్య

మహారాష్ట్ర (ముంబయి)

249

తమిళనాడు (చెన్నై)

53

ఢిల్లీ (న్యూఢిల్లీ)

49

కర్ణాటక (బెంగళూరు)

24

తెలంగాణ (హైదరాబాద్ )

11

ఇతర రాష్ట్రాలు/నగరాలు

మిగతా పోస్టులు

మొత్తం పోస్టులు

650

తెలుగు రాష్ట్రాల్లో RBI అసిస్టెంట్ పరీక్ష కేంద్రాలు (RBI Assistant Exam Centers in Telugu States)

RBI అసిస్టెంట్ నియామక ప్రక్రియలో భాగంగా, తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల సౌలభ్యం కోసం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా అభ్యర్థులు సమీప ప్రాంతాల్లోనే పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించారు.

తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు ఇవి: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం (తెలంగాణ), విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు (ఆంధ్రప్రదేశ్). ఈ కేంద్రాల్లో ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం (Application Procedure)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. మొదట RBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను జాగ్రతగా చదవాలి. తరువాత కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి వ్యక్తిగత వివరాలు, విద్యార్హత సమాచారం నమోదు చేయాలి. ఫోటో, సంతకం వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత ఫారమ్‌ను సమర్పించాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం ఒక కాపీ సేవ్ చేసుకోవడం మంచిది.

RBI అసిస్టెంట్ ఉద్యోగాలు డిగ్రీ అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించి తమ కెరీర్ ను ప్రారంభించవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/rbi-assistant-notification-2025-650-posts-77887/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top