రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రూప్-D పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 2, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సికింద్రాబాద్ జోన్‌లో 1,012 ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Railways: 1,012 Group-D vacancies in Secunderabad zoneRRB గ్రూప్‑D నోటిఫికేషన్ ఉద్యోగాల వివరాలు (RRB Group‑D Notification Job Details): భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మరోసారి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 22,195 గ్రూప్‑D (లెవల్‑1) పోస్టులను భర్తీ చేయనున్నారు . ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది యువతకు ఇది ఒక మంచి అవకాశం, ముఖ్యంగా తక్కువ విద్యార్హతతోనే రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ వర్క్‌షాప్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోనే 1,012 ఖాళీలు కేటాయించారు . అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇది ఒక్కసారి మంచి అవకాశం. స్థానికంగా పని చేసే అవకాశం ఉండటంతో చాలామంది ఆసక్తితో దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.ఈ గ్రూప్‑డి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హత పదో తరగతి లేదా ITI ఉత్తీర్ణతగా నిర్ణయించబడింది. వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC వంటి రిజర్వేషన్ వర్గాలకు వయస్సు సడలింపు లభిస్తుంది. అర్హతలు సులభంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ప్రారంభ వేతనం రూ.18,000 గా అందుతుంది. దీనితో పాటు DA, HRA , ట్రావెల్ అలవెన్స్ వంటి ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా వర్తిస్తాయి. రైల్వేలో ఉద్యోగం అంటే మంచి ఉద్యోగ భద్రత, క్రమబద్ధమైన పదోన్నతులు, రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ వంటి సౌకర్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే ప్రతి నోటిఫికేషనుకు భారీ స్పందన లభిస్తుంది.ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 2, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. చివరి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వర్ సమస్యలు ఎదురుకాకుండా ముందగానే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని కూడా సూచన ఉంది.
ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదటిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరిక సామర్ధ్య పరీక్ష (PET) ఉంటుంది.చివరిగా మెడికల్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తుది ఎంపిక చేస్తారు. మొత్తంగా చూస్తే.RRB గ్రూప్‑డి రిక్రూట్‌మెంట్ 2026 రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఒక కీలక అవకాశంగా మారింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.







