TG CET 2026 ఆన్సర్ కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?TG CET 2026 పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ సాధారణంగా పరీక్ష జరిగిన మూడు రోజుల్లో విడుదల కావాలి. కానీ ఇంకా విడుదల కాలేదు. అధికారిక ప్రాథమిక కీ ఫిబ్రవరి 26, 2026, ఫిబ్రవరి 27, 28 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత 2 నుంచి 3 రోజుల పాటు అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అనంతరం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అభ్యర్థులు కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న అనధికారిక కీ ద్వారా మార్కులను చెక్ చేసుకోవచ్చు.
గత మూడేళ్లుగా TG CET ఆన్సర్ కీ 2026 విడుదల తేదీ ట్రెండ్స్
గత మూడేళ్లలో TG CET (Telangana Gurukul Common Entrance Test) పరీక్ష ఆన్సర్ కీ విడుదల తేదీలను గమనిస్తే, ఒక నిర్దిష్టమైన సరళి కనిపిస్తోంది. సాధారణంగా పరీక్ష జరిగిన మూడు రోజుల్లో ఆన్సర్ కీ రిలీజ్ అవుతుంది.
సంవత్సరం | పరీక్షా తేదీలు | ఆన్సర్ కీ తేదీలు |
|---|---|---|
2025 | ఫిబ్రవరి 23, 2025 | పరీక్ష జరిగిన 3 రోజుల్లో |
2024 | ఫిబ్రవరి 11, 2024 | ఫిబ్రవరి 15 లోపు |
2023 | ఏప్రిల్ 23, 2023 | ఏప్రిల్ చివరి వారం |
ఆన్సర్ కీని ఎక్కడ చూసుకోవాలి?
అభ్యర్థులు అధికారిక కీ కోసం మీరు ఈ దిగువున తెలిపిన వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.tgcet.cgg.gov.in (ప్రధాన వెబ్‌సైట్)
tgswreis.telangana.gov.in
ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ముందుగా అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
హోంపేజీలోని డౌన్‌లోడ్ హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
అభ్యర్థి పేరు లేదా మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- హాల్ టికెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటికే కొన్ని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లు, ఇనిస్టిట్యూట్‌లు ఆన్సర్ కీని రిలీజ్ చేశాయి. అయితే అధికారిక ఆన్సర్ కీ కాదు. అనధికారిక ఆన్సర్ కీలు మాత్రమే ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
TG CET 2026 ఆన్సర్ కీ లైవ్ అప్‌డేట్లు
10 00 AM IST - 26 Feb'26
పరమానందయ్య శిష్యుల కథ ఏ రసానికి చెందినది?
హాస్యం
09 30 AM IST - 26 Feb'26
హేమం అనే పదానికి అర్థం వచ్చే ఇతర పదాలను గుర్తించండి
బంగారం, ఇత్తడి
09 00 AM IST - 26 Feb'26
కమల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది
వర్తమాన కాలం










