TS High Court Jobs 2023: జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.72850 జీతం

Andaluri Veni

Updated On: May 27, 2023 10:13 am IST

TS High Court నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ టీఎస్ హైకోర్టు జాబ్స్ 2023 (TS High Court Jobs 2023) విడులైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
TS High Court Jobs 2023: జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.72850 జీతంTS High Court Jobs 2023: జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.72850 జీతం

టీఎస్ హైకోర్టు జాబ్స్ 2023 (TS High Court Jobs 2023): తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. జిల్లాలోని కోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరక్ట్ రిక్రూట్‌మెంట్‌తో జాయిన్ అవ్వొచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ   రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల (TS High Court Jobs 2023) చేసింది. కేవలం టైపింగ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం అవుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు  జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

TS HIGH Court Jobs నోటిఫికేషన్ లింక్

టీఎస్ హైకోర్టు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు (TS High Court Jobs 2023 Eligibility) 

టీఎస్ హైకోర్టులో ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.    
  • అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. 
  • ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి. నిమిషానికి 45 ఇంగ్లిష్‌ పదాలను టైప్‌ చేసే సామర్ధ్యం ఉండాలి. 
  • వయసు తప్పనిసరిగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో సడలింపు ఉంటుంది. 

టీఎస్ హైకోర్టు ఉద్యోగాలకు ఎంపిక విధానం (TS High Court Jobs slection process)

ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంగ్లీష్ టైప్‌ రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌ టెస్ట్‌) ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ టైపింగ్ పరీక్షను 10 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా, బీసీ అభ్యర్థులకు 35 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. హైకోర్టులో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వెయిటేజీ వర్తిస్తుంది. ఈ స్కిల్ టెస్ట్ జూలైలో ఉంటుంది. 

టీఎస్ హైకోర్టు ఉద్యోగాలు- దరఖాస్తు ఫీజు (TS High Court Jobs-Application Fee)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400లు చెల్లించాలి. స్కిల్ టెస్ట్‌లో పాసై ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,280ల నుంచి రూ.72,850ల వరకు జీతం అందజేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-high-court-jobs-2023-notification-40574/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!