AP KGBV Recruitment 2023: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త, 1358 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వాళ్లు మాత్రమే అర్హులు

Rudra Veni

Published On:

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (AP KGBV Recruitment 2023) విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1358 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు ఇక్కడ అందజేశాం. 
AP KGBV Recruitment 2023: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త, 1358 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వాళ్లు మాత్రమే అర్హులుAP KGBV Recruitment 2023: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త, 1358 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వాళ్లు మాత్రమే అర్హులు

ఏపీ టీచర్ ఉద్యోగాలు 2023 (AP KGBV Recruitment 2023): ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (AP KGBV Recruitment 2023)ఉద్యోగాల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1358 టీచర్‌ (ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ చేసి ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు.

ఏపీ టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 టీచర్ ఉద్యోగాలు పూర్తి వివరాలు (AP KGBV Recruitment 2023 Overview)

AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

రిక్రూట్‌మెంట్ అథారిటీ పేరు AP KGBV Recruitment 2023
సొసైటీ పేరు ఏపీ కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ సొసైటీ
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ అప్లికేషన్
ఖాళీలు 1356
పోస్టుల పేర్లు ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ
ఆన్‌లైన్ అప్లై తేదీలు 29-05-2023 నుంచి జూన్ 04, 2023
అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in

ఏపీ కేజీబీవీ రిక్రూట్‌మెంట్ 2023 పోస్టుల వివరాలు (AP KGBV Recruitment 2023 Posts Details)

నోటిఫికేషన్ ప్రకారం ఏపీ కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీల వివరాలు ఈ దిగువున పట్టికలో అందజేయడం జరిగింది.

పోస్టులు ఖాళీలు సంఖ్య
ప్రిన్సిపాల్ పోస్టులు 92
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 846
సీఆర్‌టీ పోస్టులు 374
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులు 46

ఏపీ కేజీబీవీ 2023 రిక్రూట్‌మెంట్‌కు కావాల్సిన అర్హతలు (AP KGBV Recruitment Eligibility 2023)

AP KGBV రిక్రూట్‌మెంట్ 2023‌కు సంబంధించిన టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
  • అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడిగా ఉండాలి.
  • దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి దరఖాస్తు చేసిన స్థానం ఆధారంగా మారుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
  • నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అభ్యర్థులు సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.
  • కొన్ని పోస్టులకు టీచింగ్‌లో అనుభవం ఉండాలి.
ఇది కూడా చదవండి: జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply AP KGBV Recruitment 2023 Posts)

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దీనికోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://apkgbv.apcfss.inలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
  • వెబ్‌సైట్‌లో 'AP KGBV Recruitment 2023 for 958 vacancies' లింక్‌పై క్లిక్ చేయండి.
  • 958 ఖాళీల కోసం AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • వ్యక్తిగత వివరాలు, విద్యాసంబంధ వివరాలు లేదా అడిగిన మరేదైనా వంటి అన్ని ముఖ్యమైన వివరాలను అందించడం ద్వారా ఫార్మ్‌ను పూరించాలి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి Submitపై క్లిక్ చేయాలి.
  • భవిష్యత్ సూచనల కోసం అదే కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

AP KGBV రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు ప్రక్రియ మే 29 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 4. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.100లు దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-kgbv-recruitment-for-1356-teacher-posts-41189/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top