ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇదే డౌన్‌లోడ్ లింక్ (AP Supplementary Hall Ticket 2025 Link)

Rudra Veni

Published On:

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు 2025 విడుదలయ్యాయి. ఇక్కడ ఇచ్చిన లింక్‌పై (AP Inter Supplementary Hall Ticket 2025 Link) క్లిక్ చేసి విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందవచ్చు. 

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇదే డౌన్‌లోడ్ లింక్ (AP Supplementary Hall Ticket 2025 Link)ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇదే డౌన్‌లోడ్ లింక్ (AP Supplementary Hall Ticket 2025 Link)

ఏపీ సప్లిమెంటరీ హాల్ టికెట్ 2025 లింక్ (AP Inter Supplementary Hall Ticket 2025 Link) : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ఈరోజు అంటే మే 6న AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల కోసం ఇక్కడ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ (AP Inter Supplementary Hall Ticket 2025 Link) అందించాం . విద్యార్థులు హాల్ టికెట్లను పొందడానికి రెండో సంవత్సరం విద్యార్థులు వారి IPASE మే 2025 రోల్ నెంబర్ లేదా వారి మునుపటి హాల్ టికెట్‌లోని నెంబర్‌తో పాటు వారి పుట్టిన తేదీ లేదా పేరును నమోదు చేయాలి.

విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మన మిత్ర సేవను ఉపయోగించి వాట్సాప్ ద్వారా కూడా తమ హాల్ టిక్కెట్లను పొందవచ్చు. వారు తమ మార్చి 2025 హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్, పుట్టిన తేదీని 9552300009 కు పంపి, “విద్యా సేవలు” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో 10వ తరగతి హాల్ టికెట్‌ ఆప్షన్‌ను ఎంచుకుని హాల్ టికెట్లను పొందవచ్చు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్ 2025 లింక్ (AP Inter Supplementary Hall Ticket 2025 Link)

ఈ దిగువున ఇచ్చిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ సప్లిమెంటరీ హాల్ టికెట్ 2025 లింక్

AP ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to Download AP Inter Supplementary Hall Ticket 2025?)

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్ టికెట్‌లను 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందించాం. ఈ పద్ధతిని ఫాలో అయి విద్యార్థులు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల AP సప్లిమెంటరీ పరీక్ష 2025 హాల్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక BIEAP వెబ్‌సైట్‌ను bie.ap.gov.in సందర్శించాలి.
  • హోంపేజీలో 'అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు AP బోర్డు పరీక్షల హాల్ టికెట్ నుంచి మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
  • 'Submit' పై క్లిక్ చేయాలి.
  • AP సప్లిమెంటరీ 2025 పరీక్ష హాల్ టికెట్ కనిపిస్తుంది. దానిని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-inter-supplementary-hall-ticket-2025-link-65732/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top