తెలంగాణ సెట్ 2024 రిజిస్ట్రేషన్ ఎప్పుడు మొదలవుతుంది? (TS SET 2024)

Rudra Veni

Published On:

తెలంగాణ సెట్ 2024 (TS SET 2024) దరఖాస్తు ప్రక్రియ మే 14వ తేదీన ప్రారంభమవుతుంది. తెలంగాణ సెట్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
తెలంగాణ సెట్ 2024 రిజిస్ట్రేషన్ ఎప్పుడు మొదలవుతుంది?  (TS SET 2024)తెలంగాణ సెట్ 2024 రిజిస్ట్రేషన్ ఎప్పుడు మొదలవుతుంది? (TS SET 2024)

తెలంగాణ సెట్ 2024 (TS SET 2024) : ఉస్మానియా విశ్వవిద్యాలయం తన వెబ్‌సైట్‌లో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET) 2024 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. తెలంగాణ సెట్‌కు (TS SET 2024) దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో telanganaset.orgలో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 14వ తేదీన ప్రారంభమై జూలై 2న ముగుస్తుంది. అయితే ఈ తేదీ తర్వాత తమ దరఖాస్తులను సబ్మిట్ చేసే అభ్యర్థులు ఆలస్య ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు దిద్దుబాటు విండో జూలై 28 నుంచి 29 వరకు తెరవబడుతుంది. TS SET 2024 పరీక్ష ఆగస్టు 28 నుంచి 31 వరకు నిర్వహించబడుతోంది.

తెలంగాణ సెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TS SET 2024 Important Dates)

తెలంగాణ SET 2024 పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు, ఇతర ముఖ్యమైన తేదీలు TS SET నోటిఫికేషన్ 2024తో పాటు ప్రకటించబడ్డాయి. ఈ దిగువ పట్టికలో అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయండి.

ఈవెంట్స్ ముఖ్యమైన తేదీలు
TS SET 2024 నోటిఫికేషన్ మే 4, 2024
TS SET 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభం మే 14, 2024
ఆలస్య ఫీజు లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ జూలై 2, 2024
లేట్ ఫీజుతో రూ. 1500 రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూలై 8, 2024
లేట్ ఫీజు రూ. 2000తో చివరి తేదీ జూలై 16, 2024
లేట్ ఫీజు రూ. 3000తో చివరి తేదీ జూలై 26, 2024
TS SET 2024 దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు విండో జూలై 28 & 29, 2024
TS SET 2024 హాల్ టికెట్ల విడుదల తేదీ ఆగస్టు 2, 2024
తెలంగాణ సెట్ పరీక్ష తేదీ 2024 ఆగస్టు 28 నుంచి 31, 2024 వరకు

తెలంగాణ సెట్ ఎగ్జామ్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for the Telangana SET Exam?)

ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌ను అధికారులు ఇంకా యాక్టివేట్ చేయలేదు. అభ్యర్థులు
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను telanganaset.org సందర్శించాలి.
  • స్టెప్ 2: హోంపేజీలో అందించిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 3: ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను పూరించాలి.
  • స్టెప్ 4: దాంతో అభ్యర్థులకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాంతో మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • స్టెప్ 5: తర్వాత TS SET అప్లికేషన్ ఫార్మ్ 2024 ఓపెన్ అవతుంది. ఆ దరఖాస్తును విజయవంతంగా సబ్మిట్ చేయడానికి మీ వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • స్టెప్ 6: దరఖాస్తు ఫీజును చెల్లించి, భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వివరాల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ts-set-2024-application-date-52558/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top